మొక్కజొన్న కొనేరా?

ABN , First Publish Date - 2021-11-26T06:46:12+05:30 IST

జిల్లాలో మొక్కజొన్న కొనుగోలుపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహి స్తోంది. ప్రతి ఏడాది మార్క్‌ఫెడ్‌ ద్వారా పంట ఉ త్పత్తుల కొనుగోలు ప్రక్రియ నిర్వహించేవారు.

మొక్కజొన్న కొనేరా?
హిందూపురంలో నిల్వ ఉంచిన మొక్కజొన్న పంట

కొనుగోలు కేంద్రాల ఏర్పాటు 

మాట మరిచిన ప్రభుత్వం 

కోతలు పూర్తయినా పట్టించుకోని వైనం

బహిరంగ మార్కెట్‌లో

తక్కువ ధరకు విక్రయిస్తున్న రైతులు 

తక్కువ దిగుబడి, ధరలతో అన్నదాతల ఇబ్బందులు

అనంతపురం వ్యవసాయం, నవంబరు 25: జిల్లాలో  మొక్కజొన్న కొనుగోలుపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహి స్తోంది. ప్రతి ఏడాది మార్క్‌ఫెడ్‌ ద్వారా  పంట ఉ త్పత్తుల కొనుగోలు ప్రక్రియ నిర్వహించేవారు. గత ఏడాది అక్టోబరు మాసంలో మొక్కజొన్న కొనుగోలుకు రైతుల పే ర్ల రిజిస్ర్టేషన ప్రక్రియ ఆరంభించారు. నవంబరు మూడో వారం నుంచి కొనుగోలు మొదలుపెట్టారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన మొక్కజొన్న కోతలు పూర్తైనా మద్దతు ధరతో కొనుగోలు చే యడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. మార్క్‌ఫెడ్‌ జిల్లా అధికారులు ఇదివరకే కొనుగోలుకు సంబంధించి ప్రతి పాదనలు పంపినా ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడం గమనార్హం. 


కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఊసెత్తని వైనం 

జిల్లాలో ఈ ఏడాది మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఊసే ఎత్తడం లేదు. గతేడాది ఇదే సమయానికి కొనుగోలు ఆరంభించారు. గత ఏడాది  జిల్లా వ్యాప్తంగా 114  రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేశారు. అప్పట్లో క్వింటాల్‌ మద్దతు ధర రూ.1850లు వర్తింపజేశారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా 90వేల మెట్రిక్‌ టన్నులు దిగుబడి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు 27వేల మెట్రిక్‌ టన్నులు (30 శాతం దిగుబడి)  కొనుగోలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి దాకా 90 శా తం దాకా పంట కోతలు పూర్తయ్యాయి. గత కొన్ని రోజు లుగా వరుసగా పడుతున్న వర్షాలకు 10 శాతం పంట కోతను వాయిదా వేసుకున్నారు. వర్షాలు ఆగిన తర్వాత పంటను కోసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఇదివరకు కోతపూర్తైన పంటను బహిరంగ మార్కెట్‌లో విక్రయించారు. అయితే ఆశించిన స్థాయిలో ధర లేకపోవ డంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. అసలే సగం దిగుబ డి తగ్గడంతోపాటు ధర కూడా సరిగా లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 


రైతులకు తప్పని కష్టాలు 

ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 23వేల హెక్టార్ల ల్లో బోరు బావులు, మెట్ట కింద మొక్కజొన్న పంట సాగు చేశారు. ప్రభుత్వం మద్దతు ధర  క్వింటాల్‌ కు రూ.1870 లుగా నిర్ణయించింది. బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం   క్వింటాల్‌ ధర రూ.1550 నుంచి రూ.1600 వరకు నడు స్తోంది. ఈ ఏడాది జిల్లాలో మొక్కజొన్న దిగుబడి తగ్గిన నేపథ్యంలో 15 వేల నుంచి 20వేల క్వింటాళ్ల కొనుగోలుకు అనుమతించే అవకాశం ఉందని మార్కెఫెడ్‌ అధికారులు భావిస్తున్నారు. పంట కోతలు పూర్తైన పంట కొనుగోలుపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో రైతులు నష్టపో తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఎప్పటి నుంచి ప్రారంభి స్తారో తెలియక, తప్పని పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్‌ లో తక్కువ ధరకు రైతులు అమ్ముకుంటున్నారు. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలక పలు ప్రాంతాల్లో మొక్కజొన్న పంట తడిసిపోయింది. ఈ నేపథ్యంలో ఆ పంటను  వ్యా పారులు మరింత చౌకగా అడుగుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాల్సి ఉంది.  బహిరంగ మార్కెట్‌లో ధర లేదు 

మొక్కజొన్నకు బహిరంగ మార్కెట్‌లో సరైన ధర లేదు. క్వింటాల్‌ రూ.1550 నుంచి రూ.1600లకు కొంటు న్నారు. వర్షానికి తడిసిన పంటను తీసుకుంటారో లేదో తెలియడం లేదు. గతేడాది ఎకరాకు 30 నుంచి 40 క్విం టాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. ఆ పంటకు ఆశించిన స్థాయిలో ధర లేకపోవడంతో నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం మద్దతు ధర కల్పించి ఆదుకోవాలి. 

- రైతు రామకృష్ణారెడ్డి, కొటిపి, హిందూపురం మండలం 


ప్రభుత్వం ఎప్పుడు కొంటుందో ఏమో..?

మొక్కజొన్న పంటను ప్రభుత్వం ఎప్పుడు కొంటుందో ఏమో అర్థం కావడం లేదు. నేను 2 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు  చేశా. 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పోయిన ఏడాది ఈ పాటికే ప్రభుత్వం కొనుగోలుకేంద్రాలు ఏర్పాటు చేసింది. పంటను కేంద్రాల్లోనే విక్రయించాం. ఈ ఏడాది ఇంత వరకు కొనుగోలుకేంద్రాల మాట ఎత్తడం లేదు. బహిరంగ మార్కెట్‌లో ధర తక్కువగా ఉండటంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. 

-రైతు అడివప్ప, బసవన్నపల్లి, లేపాక్షి మండలం పంట నష్టం పరిశీలనకు కేంద్ర బృందం రాక!

- రెండు రోజుల్లో వచ్చే అవకాశం 

అనంతపురం వ్యవసాయం, నవంబరు 25 :  జిల్లాలో తుఫాన ప్రభావంతో జరిగిన పంటనష్టం పరిశీల నకు కేంద్ర బృందం జిల్లా పర్యటనకు రానుంది. రెండు రోజుల్లో జిల్లాకు కేంద్ర బృందం సభ్యులు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అధికారికంగా షెడ్యూల్‌ ఖరారు చేయాల్సి ఉంది. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేంద్ర బృందం పర్యటన సమాచారంతో   వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పంట నష్టపోయిన ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆపార పంటనష్టం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి దాకా 61 మండలా ల్లో 1.16 లక్షల ఎకరాల్లో రూ.169.33 కోట్ల విలువైన పప్పుశనగ, వరి, వేరుశనగ, మొక్కజొన్న, ప్రత్తి, కంది, జొన్న, ప్రొద్దు తిరుగుడు, సోయాబీన తదితర పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా. అలాగే 527.80 హెక్టార్లల్లో రూ.5.44 కోట్ల విలువైన మిరప, అరటి, బీన్స, మామిడి, కళింగర, కర్బూజ, బొప్పాయి, చీనీ, టమోటా తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 

Updated Date - 2021-11-26T06:46:12+05:30 IST