బోగస్‌ పింఛన్ల లెక్క తేలేనా?

ABN , First Publish Date - 2021-06-22T06:45:08+05:30 IST

నగరపాలక సంస్థ పరిధిలో బోగస్‌ పింఛన్లపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో బోగస్‌ లె క్క తేలేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా యి.

బోగస్‌ పింఛన్ల లెక్క తేలేనా?

విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

అనంతపురం కార్పొరేషన్‌, జూన్‌ 21 : నగరపాలక సంస్థ పరిధిలో బోగస్‌ పింఛన్లపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో బోగస్‌ లె క్క తేలేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. నగరంలో పింఛన్ల వ్యవహారంలో కొన్నేళ్లుగా అవినీతి కొనసాగుతూనే ఉంది. మృతుల పింఛన్‌ సొమ్ము తీసుకోవడం నుంచి అనర్హులకు అందజేయడం వరకూ యథామామూలే. ఇందులో సిబ్బంది, రాజకీయ నాయకుల పాత్రే కీలకం. కార్పొరేటర్ల పేర్లు కూడా బయటకు వచ్చాయంటే ఏ స్థాయిలో పింఛన్లలో గోల్‌మాల్‌ నడిచిందో అర్థమవుతుంది. ఇప్పుడు బోగస్‌ పింఛన్లపై విచారణ చేపడుతున్నారు.


ఈసారి ఏకంగా ప్రభుత్వం నుంచే అధికారుల విచరణకు ఆదేశాలందాయి. ఈనెల 16న ఆ జాబితాను సంబంధిత కార్యాలయాలకు పంపారు. ప్రఽ దానంగా వితంతు, ఒంటరి మహిళ పింఛన్లపై విచారణ చేపడుతున్నారు. వాటిని తీసుకుంటున్న వారి రేషన్‌కార్డుల్లో భర్తల పేర్లు ఉండటంతో క్షేత్రస్థాయి లో వాస్తవాలేంటనేది పరిశీలించనున్నారు. దీంతో అటు బోగస్‌ పింఛన్లు తీసుకునే వా రిలోనూ.. ఇటు అర్హులైన వా రిలో సైతం ఆందోళన మొదలైంది. నెలాఖరులోపు విచారణ పూర్తి చేసి, నివేదిక అందజేయాల్సి ఉంటుంది. మరి ఈసారి బోగ్‌సల గుట్టు రట్టవుతుందా...? లేదా..? అనేది మరి కొన్ని రోజుల్లోనే తేలనుంది.


2230 పింఛన్లపై విచారణ

ఎవరు అర్హులు, ఎవరు అనర్హులో తేల్చే విషయం లో పింఛన్‌ విభాగ అధికారులు, సిబ్బంది తలమునకలవుతున్నారు. ఇప్పటికే ఆయా సచివాలయాల ద్వారా పింఛన్లు పొందుతున్న వారికి నోటీసులందాయి. అనంతపురం కార్పొరేషన్‌లో మొత్తం 2230 పింఛన్లపై విచారణ సాగనుంది. అందులో 1712 వితంతు పింఛన్లుండగా... ఒంటరి మహిళలకు సంబంధించి 518 ఉన్నాయి. నగరంలో మొత్తం 23600 పింఛన్లు అందజేస్తున్నారు. అం దులో ఒంటరి మహిళలు 1150 వరకు, వితంతు పింఛన్లు 8 వేల పైచిలుకు ఉన్నాయి. వితంతు పింఛన్లు పొందేవారిలో భర్తలు మృతి చెందినప్పటికీ కొందరు బియ్యం కార్డుల్లో పేర్లు అలాగే ఉంచుకున్నారు. వాటిని ఆన్‌లైన్‌లో తొలగించుకోవాల్సి ఉంటుంది. ఇందులో కొందరు అవగాహనలేక వాటిని తొలగించుకోలేదని తెలుస్తోంది. కొం దరు రేషన్‌ బియ్యం కోసం అలాగే ఉంచారనే వాదన లేకపోలేదు. బోగస్‌ కాదని నిరూపించుకోవాల్సిన వారు సంబంధిత సర్టిఫికెట్లు పొందుపరచాల్సి ఉంటుంది. భర్త మరణ ధృవీకరణ పత్రం అప్‌లోడ్‌ చేయించాల్సి ఉంటుంది. కేవైసీ కూడా తప్పనిసరని అధికారులు చెబుతున్నారు.


ఎన్నింటి గుట్టు రట్టవుతుందో..?

కొన్నేళ్లుగా పింఛన్ల వ్యవహారంలో సిబ్బందిపై రా జకీయ ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు సచివాలయ సిబ్బందిపై కూడా తప్ప డం లేదు. ప్రభుత్వం విచారణ చేయమని  ఆ దేశించిన వాటిలో వైసీపీ  అధికారం చేపట్టాక కొత్తగా చే ర్చిన పింఛన్లు కూడా ఉన్నాయట. కార్పొరేషన్‌ పరిధిలో ఒంటరి మహిళల పింఛన్లలోనే అధికంగా బోగస్‌ ఉన్నాయనే ఆరోపణలున్నాయి. మొదటి నుంచి కొందరు భర్తలున్న వారికి సైతం ఇలాంటి పింఛన్లు ఇప్పించినట్లు సమాచారం. ఉన్న 1150 లోనే సగం వరకు పింఛన్లు అంటే 518పై విచారణకు ఆదేశాలందాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వితంతు పింఛన్లలో 30 శాతం వరకు బోగస్‌ అని తేలే అవకాశం లేకపోలేదు. మరి విచారణ లో ఎన్ని పింఛన్ల గుట్టు రట్టవుతుందో వేచిచూడాల్సిందే.

Updated Date - 2021-06-22T06:45:08+05:30 IST