రైతు వ్యతిరేక జీఓలను భోగిమంటల్లో కాల్చేయండి: పల్లె

ABN , First Publish Date - 2021-01-13T07:40:39+05:30 IST

రైతు సంక్షేమమంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుని రైతు వ్యతిరేక జీఓలను తెచ్చిందని వాటిని భోగిమంటల్లో కాల్చివేయాలంటూ మాజీ మంత్రిపల్లె రఘునాథరెడ్డి సూచించారు.

రైతు వ్యతిరేక జీఓలను భోగిమంటల్లో కాల్చేయండి: పల్లె

పుట్టపర్తి, జనవరి 12: రైతు సంక్షేమమంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుని రైతు వ్యతిరేక జీఓలను తెచ్చిందని వాటిని భోగిమంటల్లో కాల్చివేయాలంటూ మాజీ మంత్రిపల్లె రఘునాథరెడ్డి సూచించారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఓడీసీ మండల కార్యకర్తల, నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్‌గా జయచంద్రను ఏకగీవ్రంగా ఎంపికచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక అంటూనే రైతుకు వ్యతిరేకంగా ఐదు జీఓలు తీసుకువచ్చిందని, వాటిని బోగిమంటల్లో వే యాలన్నారు. కష్టకాలంలో కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ ఆదే శాల మేరకు ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాలన్నారు. ఇటీవల మరణించిన చలపతినాయుడుకు ని వాళులర్పిస్తూ మౌనం పాటించారు. ఈ నెల 18వతేదీన ఎన్టీఆర్‌ జయంతి రోజు నిర్వహించే రక్తదాన శిబిరంలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్లాబకాష్‌, ఓబుళరెడ్డి, ఇస్మాయిల్‌, రాజారెడ్డి, శంకరనాయుడు, టైలర్‌నిజామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T07:40:39+05:30 IST