ఈతకెళ్లి విద్యార్థి గల్లంతు

ABN , First Publish Date - 2021-02-05T06:24:12+05:30 IST

స్థానిక హెచ్చె ల్సీలో ఈతకు వెళ్లి 7వ తరగతి విద్యార్థి హుస్సేన గల్లం తయ్యాడు.

ఈతకెళ్లి విద్యార్థి గల్లంతు

బుక్కరాయసముద్రం, ఫిబ్రవరి 4: స్థానిక హెచ్చె ల్సీలో ఈతకు వెళ్లి 7వ తరగతి విద్యార్థి హుస్సేన గల్లం తయ్యాడు. ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపిన మేరకు బుక్కరాయ సముద్రం గ్రామానికి  చెందిన షెక్షా కుమారుడు హుస్సే న గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 7వతరగతి చ దువుతున్నాడు. పాఠశాలకు బయల్దేరిన హుస్సేన దారి మధ్యలోనే సైకిల్‌, పుస్తకాలు పెట్టి బంధువుల పిల్లలతో కలిసి ఈతకు హెచ్చెల్సీ వద్దకు వెళ్లాడు. ఈత రాకపో యినా కాలువలోకి మిగిలిన పిల్లలతో  పాటు దిగాడు.  కాలువ లోతు ఎక్కవగా ఉండటంతో మునిగి పోయాడు. హుస్సేనను కాపాడేందుకు బంధువుల పిల్లవాడు ప్రయత్నించాడు. అయినా హుస్సేన నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు. వెంటనే జరిగిన సంఘటనను వారి తల్లిదండ్రులకు తెలిపాడు. గల్లంతైన విద్యార్థి కోసం స్థాని కులు, ఆగ్నిమాపక సిబ్బంది, పోలీసు సిబ్బంది దాదాపు 50 మంది కలిసి కాలువలో దిగి గాలించారు. అయినా ఫలితం లేదు. బుక్కరాయసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-02-05T06:24:12+05:30 IST