టీడీపీలో చేరిన బొంతలపల్లి సర్పంచు అభ్యర్థి

ABN , First Publish Date - 2021-02-05T06:36:11+05:30 IST

తనకల్లు మండలం బొంతలపల్లి సర్పంచ్‌ అభ్యర్థి, వైసీపీ మద్దతుదారురాలు జయంతి, ఆమె భర్త రాచపల్లి నరసింహులు గురువారం టీడీపీలో చేరారు.

టీడీపీలో చేరిన బొంతలపల్లి సర్పంచు అభ్యర్థి
కందికుంట సమక్షంలో టీడీపీలో చేరుతున్న జయంతి

 కదిరి, ఫిబ్రవరి 4: తనకల్లు మండలం బొంతలపల్లి సర్పంచ్‌ అభ్యర్థి, వైసీపీ మద్దతుదారురాలు జయంతి, ఆమె భర్త రాచపల్లి నరసింహులు గురువారం టీడీపీలో చేరారు. వారికి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు వందమందికి పైగా వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు మోపూరిశెట్టి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-05T06:36:11+05:30 IST