గరుడ వాహనంపై కొండమీదరాయుడు

ABN , First Publish Date - 2021-02-26T06:39:34+05:30 IST

కొండమీదరాయుడు బ్రహోత్సవాల్లో భా గంగా గురువారం రాత్రి స్వామి వారిని గరుడ వాహనంపై ఊరేగించారు.

గరుడ వాహనంపై కొండమీదరాయుడు

బుక్కరాయసముద్రం, ఫిబ్రవరి 25: కొండమీదరాయుడు బ్రహోత్సవాల్లో భా గంగా గురువారం రాత్రి స్వామి వారిని గరుడ వాహనంపై ఊరేగించారు. స్వామివారిని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఉ దయం స్థానిక కొండమీదరాయడి ఆలయంలో ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం స్వామి వారిని గజవాహనంపై ఊరేగిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.  


తొండపాడులో రంగనాథుడు

గుత్తిరూరల్‌, ఫిబ్రవరి 25: మండలంలోని తొండపాడు గ్రామంలో వెలసిన బొలికొండ రంగనాథ స్వామిని గురువారం గరుడ వాహనంపై ఊరేగించారు. ఉదయం స్వామివారికి విశేష అలంకరణ చేసి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతుడైన బొలికొండ రంగనాథస్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో కొలువుదీర్చి గ్రామ వీధుల్లో మేళాతాళాల మధ్య ఊరేగించారు. అనంతరం ఉత్సవమూర్తులను చిన్న ర థంపై కొలువుదీర్చి భక్తులు జమ్మిచెట్టు వరకు లాగారు. ఈ కార్యక్రమంలో ఆల య ఈఓ దేవదాసు, ఆలయ సిబ్బం ది, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-26T06:39:34+05:30 IST