శ్రీ కృష్ణదేవరాయలు బతికి ఉంటే మీ అభివృద్ధి చూసి ఆత్మహత్య చేసుకునేవారు

ABN , First Publish Date - 2021-10-14T06:25:42+05:30 IST

పట్టణంలో విజయనగర రాజు లు చేపట్టిన అభివృద్ధి పనుల్లో మిగిలిపోయిన పనులను తానే పూర్తి చేస్తున్నట్లు రోడ్లు, భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఎద్దేవా చేశాడు.

శ్రీ కృష్ణదేవరాయలు బతికి ఉంటే   మీ అభివృద్ధి చూసి ఆత్మహత్య చేసుకునేవారు

మంత్రి శంకరనారాయణపై మాజీ ఎమ్మెల్యే బీకే ఫైర్‌

పెనుకొండ, అక్టోబరు 13: పట్టణంలో విజయనగర రాజు లు చేపట్టిన అభివృద్ధి పనుల్లో మిగిలిపోయిన పనులను తానే పూర్తి చేస్తున్నట్లు రోడ్లు, భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని  హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఎద్దేవా చేశాడు. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు బతికి ఉం టే మంత్రి చేసిన అభివృద్ధిని చూసి ఆత్మహత్య చేసుకుని ఉండేవారన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాల యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో బీకే మాట్లాడుతూ రెండు రోజుల కిందట పెనుకొండలో రోడ్ల నిర్మాణానికి భూమిపూజ సందర్భంగా మంత్రి శంకరనా రాయణ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల కాలంలో చేపట్టి మిగిలి పోయిన పనులను తాను పూర్తి చేశానని చెప్పటాన్ని తీవ్రంగా ఖండించారు. వైసీపీ అధికారం చేపట్టి మూడేళ్లవుతున్నా రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమ న్నారు. రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలు పడటంతో వాహనాల రాకపోకలు, ప్రజలు నడవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోడ్లు భవనాలశాఖ మంత్రిగా ఉన్న ఓ అపర శ్రీకృష్ణదేవరాయా! కనీసం మీ నియోజకవర్గంలో  రోడ్లు కూడా బాగు చేసుకోలేని అసమర్థ మంత్రివి నీవు అన్నారు. నీ ఇంటి ముందు రోడ్డునే సరిచేసుకోలేనివాడివి రాష్ట్రంలోని రోడ్లను ఏం మరమ్మతు చేస్తావంటూ విమర్శించారు. నన్ను అసమర్థ ఎమ్మెల్యే అని విమర్శించావు. అసమర్థ ఎమ్మెల్యే అయిన నేను నా కాలంలో విజయన గర సామ్రాజ్య రెండో రాజధాని అయిన పెనుకొండలో పూర్వ వైభవం తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేశానన్నారు. కియ కార్లపరిశ్రమ, అనుబంధ పరి శ్రమలను నెలకొల్పిన ఘనత టీడీపీదేనన్నారు. సమా వేశంలో రాష్ట్ర రైతు కార్యనిర్వాహక కార్యదర్శి జీవీపీ నా యుడు, అధికార ప్రతినిధులు రొద్దం నరసింహులు, కార్యనిర్వాహక కార్యదర్శి మునిమడుగు  వెంకటరాముడు, నాయకులు బొక్సంపల్లి రామకృష్ణ, శ్రీరాములు, సిద్దలింగప్ప, త్రివేంద్ర, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-14T06:25:42+05:30 IST