అమలుకాని బయోమెట్రిక్‌..!

ABN , First Publish Date - 2021-09-03T05:58:50+05:30 IST

ప్రతిఒక్కరూ బ యోమెట్రిక్‌ హాజరు నమోదు అమలు చేయాల్సిందేనని ప్రభు త్వం సుస్పష్టంగా జారీ చేసిన ఆదేశాలు పేపర్లకే పరిమితమయ్యాయి.

అమలుకాని బయోమెట్రిక్‌..!

మొరాయిస్తున్న యంత్రాలు... కంప్యూటర్లదీ అదే పరిస్థితి

ఆరేళ్లు గడుస్తున్నా.. గాడిన పడని వైనం

ఇదీ సంక్షేమ వసతిగృహాల్లో దుస్థితి

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 2: ప్రతిఒక్కరూ బ యోమెట్రిక్‌ హాజరు నమోదు అమలు చేయాల్సిందేనని ప్రభు త్వం సుస్పష్టంగా జారీ చేసిన ఆదేశాలు పేపర్లకే పరిమితమయ్యాయి. సంక్షేమ వసతిగృహాల్లో బయోమెట్రిక్‌ అమలు చేయ డం లేదు. విద్యార్థులు, వార్డెన్లు, సిబ్బంది హాజరు ఆనలైనలో న మోదు చేసేందుకు నానా అవస్థలు పడుతున్నారు. బయోమెట్రిక్‌ అమలు చేస్తే.. బోగస్‌ సంఖ్య నమోదుకు ఆ స్కారం ఉండదు. విద్యార్థుల కచ్చితమైన సంఖ్యను ఆనలైనలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సంక్షేమ వసతిగృహాల్లో బయోమెట్రిక్‌ అమలు చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరేళ్లుగా అదిగో... ఇదిగో అంటూకాలం గడిపేస్తున్నారు. బయోమెట్రిక్‌ అమలు చేస్తే వార్డెన్లు స్థానికంగా ఉండాల్సి ఉంటుంది. దీం తో ఆయా పట్టణాల నుంచి హాస్టళ్లకు వార్డెన్లు ఆలస్యంగా వెళ్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇలా బయోమెట్రిక్‌ అమలు చేస్తే ఉదయం 6 గంటలకే ఆనలైనలో నమోదు చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్‌ యంత్రాలు తరచూ మొరాయిస్తున్నాయి. నిర్వహ ణ ఏమాత్రం బాగోలేదని వార్డెన్లు చెబుతున్నారు. బయోమెట్రిక్‌ మిషనకు అవసరమైన ఇంటర్నెట్‌, ఇతర స్టేషనరీకి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు చెల్లించడం లేదు. దీంతో వార్డె న్లే ఆ మొత్తాన్ని భరిస్తున్నారు. ఎక్కువమంది విద్యార్థులను చూ పుతూ నిధులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఆదినుంచీ వినిపిస్తున్నాయి. బోగస్‌ విద్యార్థుల నమోదు, వార్డెన్లు విధులకు డు మ్మా కొట్టడం తదితరాలకు బయోమెట్రిక్‌ అడ్డుపడుతుంది. దీం తో వార్డెన్లు ససేమిరా అంటున్నారు. మ్యానువల్‌గా చేస్తే సరిపోతుంది కదా అంటూ కాలం వెలిబుచ్చుతున్నారు. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో తిరిగి తెరుచుకున్న సంక్షేమ వసతిగృహాల్లో బయోమెట్రిక్‌ అమలుకు నోచుకోవడం లేదు. పైగా బయోమెట్రిక్‌ మిషన్ల స్థానంలో కంప్యూటర్లు ఇచ్చినా అవి కూడా మొరాయిస్తుండడం గమనార్హం. బయోమెట్రిక్‌ నమోదుకు వార్డెన్లు ఆసక్తి చూపకపోవడం, సంక్షేమ శాఖల అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో హాస్టళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అసలు వార్డెన్లు ఎప్పుడు హాస్టల్‌కు వస్తారో... ఎప్పుడు వెళ్తారో.. అర్థంకాని పరిస్థితి నెలకొంది.


బయోమెట్రిక్‌ అమలు చేయాల్సిందే...

ప్రతి హాస్టల్‌లో కచ్చితంగా బయోమెట్రిక్‌ హాజరు నమోదు ఉం డాల్సిందే. బయోమెట్రిక్‌ యంత్రాలు పనిచేయనిచోట కంప్యూట ర్లు వినియోగించాలని వార్డెన్లకు ఇప్పటికే సూచించాం. సహాయాధికారులు కచ్చితంగా తరచూ వసతిగృహాలను తనిఖీ చేసి, సమస్యలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. ఇది అమలు చే యని అధికారులు, వార్డెన్లపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోం. వసతిగృహాల పునఃప్రారంభం నేపథ్యంలో కరోనా నిబంధనలు తప్పక పాటించాలని ఇప్పటికే సూచించాం.

- బీసీ, ఎస్సీ సంక్షేమశాఖల డీడీలు  యుగంధర్‌, విశ్వమోహనరెడ్డి, డీటీడబ్ల్యూఓ అన్నాదొర


Updated Date - 2021-09-03T05:58:50+05:30 IST