రూ.కోటి ఉపాధి బిల్లులు పెండింగ్‌

ABN , First Publish Date - 2021-10-25T06:44:06+05:30 IST

ఉపాఽధి హామీ పథకం కింద పనులు చేసి ఆరు వారాలైనా నేటికీ బిల్లులు అందకపోవడం, స్థానికంగా కొత్త పనులు దొరక్కపోవడంతో కూలీలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

రూ.కోటి ఉపాధి బిల్లులు పెండింగ్‌

పనులు చేసి ఆరు వారాలైనా అందని బిల్లులు

కార్యాలయం వద్ద లబ్ధిదారుల నిరీక్షణ

మడకశిర, అక్టోబరు 24: ఉపాఽధి హామీ పథకం కింద పనులు చేసి ఆరు వారాలైనా నేటికీ బిల్లులు అందకపోవడం, స్థానికంగా కొత్త పనులు దొరక్కపోవడంతో కూలీలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన మడకశిర నియోజకవర్గంలో ఉపాధి కల్పించే ఎటువంటి పరిశ్రమలు లేకపోవడంతో స్థానికంగా దొరికే పనులు, వ్యవసాయ పనులు, ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేస్తూ అనేక మంది జీవనం సాగిస్తున్నారు. కరోనా మహమ్మారి రాకమునుపు కర్ణాటకలోని బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్లి పనులు చేస్తూ ఉపాధి పొందేవారు. గత సంవత్సరం కరోనా విజృంభించడంతో వలస వెళ్లినవారు తిరిగి స్వగ్రామాలకు తిరిగి వచ్చారు. వారు ఉపాఽధి, వ్యవసాయ పనులకు వెళ్లేవారు. వేరుశనగ పంట ఈ ఏడాది దెబ్బతినడంతో వ్యవసాయ పనులు దొరకడం లేదు. ఉపాధి పథకం ద్వారా వంద రోజులు పనిదినాలు పూర్తి చేసుకొన్న కూలీలు పనుల  కోసం వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది.  పనులు చేసిన కూలీలు బిల్లుల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మడకశిరనియోజకవర్గంలోని రొళ్ల, అగళి, గుడిబండ, అమరాపురం, మడకశిర మండలాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేసిన కూలీలకు రూ.కోటి దాకా అందాల్సి ఉంది. అమరాపురంలో 800 మంది కూలీలకు రూ.18 లక్షలు, మడకశిర మండలంలో 3 వేల మందికి రూ.25 లక్షలు, అగళి మండలంలో 2388 మందికి రూ.23 లక్షలు, రొళ్ల మండలంలో 1500 మందికి రూ.50 లక్షలు, గుడిబండ మండలంలో 200 మందికి రూ.5 లక్షల దాకా బిల్లులు అందాల్సి ఉంది. స్థానికంగా పనులు దొరక్క... చేసిన పనులకు బిల్లులు రాక కూలీలకు జీవనోపాధి దుర్భరంగా మారింది. ఇతర ప్రాంతాలకూ వలస వెళ్లలేని పరిస్థితి.  వంద రోజులు పనిదినాలు పూర్తి చేసుకొన్న కూలీలు 30 శాతం పైబడి ఉన్నారు. పనులు లేకపోవడంతో తము ఇబ్బందులు పడుతున్నామని, పనులు కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు. 


పనులు లేవు... బిల్లులు రాలేదు... 

ఉపాధి హామీ ప థకం ద్వారా ప నులు చేసి ఆ రు వారాలు అయినా బిల్లు లు నేటికీ అందలేదు. ఒక పక్క వంద రోజులు పనిదినాలు పూర్తికావడంతో పనుల కో సం కూడా వెతుక్కోవలసిన పరిస్థి తి నెలకొంది. ఆరు వారాలుగా పను లు చేశాము. దాదాపు రూ.5వేల వరకు బిల్లులు అందాల్సి ఉంది. పనులు కల్పించి.. బిల్లులు మం జూరు చేసి ఆదుకోవాలి.

- శంకర్‌, హెచటీ హళ్లి


మంజూరైన వెంటనే ఇస్తాం 

ఉపాధి హామీ పథకం ద్వారా ని యోజకవర్గంలో పనులు చేసిన కూలీలకు ఆరు వారాలుగా బిల్లు లు చెల్లించాల్సి ఉంది. ఆ బిల్లులు మం జూరైన వెంటనే వారి ఖాతాల్లోకి నగదు జమ చేస్తాం. వంద రోజులు పనులు పూర్తి చేసుకొన్న కూలీలకు కేంద్ర ప్రభుత్వం మరో 50 రోజులు పనిదినాలు పెంచితే.. వారికి పనులు కల్పిస్తాం. 

- లక్ష్మీనారాయణ, ఏపీడీ


Updated Date - 2021-10-25T06:44:06+05:30 IST