‘స్వచ్ఛసంకల్పం’ అమలుకు సన్నద్ధం కండి
ABN , First Publish Date - 2021-08-25T05:41:53+05:30 IST
జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలు కు సన్నద్దం కావాలనీ, అందుకు కా వాల్సిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలని జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి.. ఈఓఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.

జడ్పీ సీఈఓ భాస్కర్ రెడ్డి
అనంతపురం రైల్వే, ఆగస్టు 24: జగనన్న స్వచ్ఛ సంకల్పం అమలు కు సన్నద్దం కావాలనీ, అందుకు కా వాల్సిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలని జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి.. ఈఓఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఈఓఆర్డీలు, మేజర్ పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. తొలుత గత వారంలో అనారోగ్యంతో మృతిచెందిన డీఎల్‌పీఓ రమణ చిత్రపటానికి పూలమాల వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపాన్ని ప్రకటించారు. అ నంతరం జడ్పీ సీఈఓ మాట్లాడుతూ జగనన్న స్వచ్ఛసంకల్పం ప్రారంభంలోపు అందు కు కావాల్సిన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలన్నారు. ఇందులో ఈఓఆర్దీలు, కార్యదర్శులు, సర్పంచ్‌లు సమష్టిగా పని చేయాలన్నారు. డీపీఓ శివారెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీల్లో పన్ను వసూళ్లలో చాలా వెనుకబడ్డామన్నారు. వసూళ్లు వేగవంతం చేసి, గడువులోపు పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ సీఈఓ శ్రీనివాసులు, ఏఓ ఖాదర్‌బాషా, సూపరింటెండెంట్లు నాగరాజు, సోమశేఖర్, ఈఓఆర్డీలు, మేజర్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.