ఆరోగ్య విషయంలో జాగ్రత్త..!
ABN , First Publish Date - 2021-10-29T05:49:41+05:30 IST
విధి నిర్వాహణతో పాటు ఆరోగ్య విషయాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సెబ్ అదనపు ఎస్పీ రామ్మోహనరావు పేర్కొన్నారు.
అనంతపురం క్రైం, అక్టోబరు 28 : విధి నిర్వాహణతో పాటు ఆరోగ్య విషయాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సెబ్ అదనపు ఎస్పీ రామ్మోహనరావు పేర్కొన్నారు. పోలీసు అమర వీరు ల వారోత్స వాల్లో భాగంగా గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఉచిత వైద్యశిబిరం, రక్తదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా వైద్యులు, వైద్యసిబ్బంది పోలీసు సిబ్బందికి తగిన వైద్యచికిత్సలతో పా టు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించారు. తర్వాత పోలీసులు రక్తదానం చేశారు. అనంతరం సెబ్ అదనపు ఎస్పీ రామ్మోహనరావు మాట్లాడుతూ.. పోలీసు సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు ఆ రోగ్యంగా ఉండాలన్నారు. ఆరోగ్య విషయాలపై నిర్లక్ష్యం చేయరాదన్నా రు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు నాగేంద్రుడు, ఓఎస్డీ రామకృష్ణ ప్రసాద్, ఏఆర్ అదనపు ఎస్పీ హనుమంతు, పోలీసు ఆ సుపత్రి వైద్యు లు వెంకటేశ్వర ప్రసాద్, వేల్ఫేర్ ఆర్‌ఎస్‌ఐ రాజశేఖర్ రెడ్డి, జిల్లా పోలీ సు అధికారుల అడహక్ కమిటీ సభ్యులు త్రీలోక్‌నాథ్, సుధాకర్‌రెడ్డి, తేజ్‌పాల్, కిమ్స్ సవేరా వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
రాప్తాడు/ అనంతఅర్బన: పోలీసు అమర వీరుల వారోత్సవాల సందర్బంగా గురువారం రాప్తాడు ఆర్డీటీ కార్యాలయంలో రాప్తాడు, ఇటుకలపల్లి పోలీసులు సీఐ విజయభాస్కర్‌గౌడ్ ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. పోలీసు సిబ్బందితో పాటు అనంతలక్ష్మి, శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థులు మొత్తం 94 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.... సమాజంపై అవ గాహ న కలిగిఉండాలని, సేవా భావాలను అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎస్‌ఐ రాఘవరెడ్డి, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే రక్తదానం చేసిన అనంతలక్ష్మి కళాశాల చైర్మన అనంతరాముడు, వైస్‌చైర్మన రమేష్‌నాయుడుకు అభినందనలు తెలిపా రు. అనంతరం ఆర్డీటీ బ్లడ్‌బ్యాంక్ సిబ్బంది దాతల నుంచి రక్తాన్ని సేక రించారు. కార్యక్రమంలో రాప్తాడు ఎస్‌ఐ రాఘవరెడ్డి, జాతీయ సేవా పథకం అధికారి ఖలీల్‌బాషా, నవీనకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
గార్లదిన్నె : పోలీసుల అమరవీరుల వారోత్సవాలను పురస్కరిం చుకుని గురువారం రాత్రి ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు, మహిళా పోలీసులు, వలంటీర్లు, చిన్నపిల్లలు తదితరులు స్థానిక పోలీస్‌ష్టేషన నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మా నవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ... పోలీసు అమర వీరుల సేవలు మరువులేనివన్నారు. వారోత్సవాల్లో భా గంగా వారంరోజుల నుంచి వివిధ పాఠశాలల విద్యార్థులకు పోలీసుల విధులు, చట్టాలు, ఆయుధాలపై అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు ఏఎస్‌ఐ శేషగిర్రి, దేవా, సురేష్, శంకర్‌రెడ్డి, రాజేష్, రంగారెడ్డి, మునీంద్ర తదితరులు పాల్గొన్నారు.