ధైర్యంగా ఉండండి.. కరోనాను జయించండి

ABN , First Publish Date - 2021-05-20T06:12:17+05:30 IST

భయపడకుండా ధైర్యంగా ఉండి కరోనాను జయించాలని అనంతపురం పార్లమెంట్‌ ఎంపీ తలారి రంగయ్య కరోనా భాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

ధైర్యంగా ఉండండి.. కరోనాను జయించండి

- ఎంపీ తలారి రంగయ్య

బత్తలపల్లి, మే19: భయపడకుండా ధైర్యంగా ఉండి కరోనాను జయించాలని అనంతపురం పార్లమెంట్‌ ఎంపీ తలారి రంగయ్య కరోనా భాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. స్థానిక ఆర్డీటీ ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం ఎంపీ తలారి రంగయ్య సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన కోవిడ్‌ ఉన్న వార్డులోకి వెళ్లి కోవిడ్‌ రోగులకు అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. కరోనా వచ్చిందని ఎవ్వరూ భయపడవద్దని ధైర్యంగా ఉంటే ఆ వ్యాధి మీనుంచి పారిపోతుందని ధైర్యం చెప్పారు. వార్డుల్లో అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆక్సిజన సరఫరాలో ఎవైనా సమస్యలు ఉన్నాయా అని వైద్యులను, రోగులను అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాధికి ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదని మాస్కు ధరించి సామాజికదూరం పాటిస్తే కరోనా వ్యాధిని అరికట్టవచ్చున్నారు. 90ఏళ్లు పైబడిన వారు కూడా కరోనాను జయించారని కావున ప్రతి ఒఝ్కరూ ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ సందర్బంగా మెడికల్‌ డైరెక్టర్‌తో మాట్లాడుతూ కరోనాతో ఆసుపత్రికి వచ్చేవారికి ఎటువంటి ఆసౌకర్యాలు కలిగించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. 


Updated Date - 2021-05-20T06:12:17+05:30 IST