ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2021-12-30T05:54:00+05:30 IST

ప్రభుత్వ పథకాల పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి

సచివాలయాల తనిఖీలో జేసీ సిరి

కదిరిఅర్బన్‌, డిసెంబరు 29 : ప్రభుత్వ పథకాల పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి పేర్కొన్నారు. బు ధవారం పట్టణంలోని ఎన్‌జీవో కాల నీ, సైదాపురంలలో వార్డు సచివాల యాలను జేసీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సచి వాలయంలో ప్రభుత్వ పథకాల పోస్ట ర్లు ఏర్పాటు చేసి, వాటి పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పథకాల కు సంబంధించిన పోస్టర్లను ఆయా సచివాలయాల్లో ఖచ్చితంగా ప్రదర్శించాలన్నారు. సచివాలయ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద మెనూ ప్రకారం విద్యార్థులకు అందిస్తున్నారా లేదా అని పరిశీలించాలని వెల్ఫేర్‌ అసిస్టెంట్‌లను ఆదేశించారు. కొవిడ్‌ నేపథ్యంలో శానిటేషన్‌ కార్యక్రమాలు విరివిగా చేపట్టాలని, వ్యాక్సిన్‌ కూడా మొదటి, రెండవ డోస్‌లు వేయించాలన్నారు. అనంతరం జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్‌బాబు, ఎంఈఓ చెన్నక్రిష్ణ, మధ్యాహ్న భోజన పర్యవేక్షకులు సుధాకర్‌, మధు సూదన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-30T05:54:00+05:30 IST