చిక్కడు .. దొరకడు
ABN , First Publish Date - 2021-03-24T05:52:34+05:30 IST
ఆ అధికారి ఎక్కడ పని చేసినా తన రెవెన్యూ బాధ్యతలు వదిలి రియల్‌దందాలో మునిగి తేలేవాడు. ఆయనకు పది నిమిషాలు కూడా తన కుర్చీలో కుర్చునేంత ఓపిక కూడా ఉండదు. అంటే ఆయన రియల్‌దందా కొనసాగించడంలో అంత బిజీ అన్నమాట.

ఎక్కడ పనిచేసినా భూదందాలే
అవినీతిలోనూ సామ్రాట్
ఫైల్ కదలాలంటే పైసలివ్వాల్సిందే..
సీకేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో
ఓ అధికారి అక్రమాల బాగోతం
ధర్మవరం/చెన్నేకొత్తపల్లి, మార్చి23: ఆ అధికారి ఎక్కడ పని చేసినా తన రెవెన్యూ బాధ్యతలు వదిలి రియల్‌దందాలో మునిగి తేలేవాడు. ఆయనకు పది నిమిషాలు కూడా తన కుర్చీలో కుర్చునేంత ఓపిక కూడా ఉండదు. అంటే ఆయన రియల్‌దందా కొనసాగించడంలో అంత బిజీ అన్నమాట. ఆయన సొం త వ్యాపకాల్లో మునిగి తేలుతుండగా వివిధ పనుల కోసం వచ్చే ప్రజ లకు అధికారి కనిపించకపోవడంతో ఈ అధికారి ఏమిటి చిక్కడు దొరకడు అం టూ నిట్టూరుస్తూ వెనుదిరుగుతున్న పరిస్థితి చె న్నేకొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో నిత్య కృత్యమైంది. ఆ అధికారి పెనుకొండలో పనిచేసిన సమ యంలో రియల్‌దందా, అవినీతిలో కోట్లాది రూపాయలు సొమ్ముచేసుకున్నట్లు అక్కడి ప్రజలు ఇప్పటికి చర్చించుకుంటున్నారు. తాజాగా చెన్నేకొత్తపల్లి మండలం నాగ సముద్రం పొలంలో ఓ రైతుకు చెందిన పూర్వపుపట్టాను అమ్మటంతో ఆయన అవినీతి దందాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి.
అవినీతిలో ఆయనకు సరిలేరెవ్వరూ!
భూ దందాలే కాదు అవినీతిలోనూ అందెవేసినా చెయ్యి ఆ అధికారిది. చిన్నదైనా, పెద్దపనైనా ఆయనకు చెయ్యి తడపాల్సిందే. లేదంటే నెలల తరబడి తిరిగినా పని జరగదు. ఏవో కుంటిసాకులు చెబు తూ రైతులను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటాడు. చివరికి ఆయన తీరుతో చాలా మంది రైతులు తమ భూరికార్డులను సరి చేసుకోవడాన్ని వదిలిపెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాని ప్రకారం ఎవరైనా సరే ముడుపులు ఇచ్చుకోవాల్సిందే. లేదంటే ఆ ఫైల్‌ను మూలన పడేస్తాడన్న విమర్శలు ఉన్నాయి. కొత్తపా్‌సపుస్తకం చేసుకోవాలన్న తండ్రి నుంచి కొడుకులకు పట్టా మార్చుకోవాలన్న రూ.లక్షకు పైనే డిమాండ్ చేస్తాడనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తు న్నాయి. ఈయన వ్యవహర శైలిపై పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖాలాలు లేవు.
ఎక్కడ పనిచేసినా భూదందాలే
భూ దందాలు చేయడం ఆ అధికారి దినచర్య. విధులకు పంగనామాలు పెట్టైనా సరే రియల్‌దందా కొన సాగిస్తాడన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఏ ప్రాం తంలో విధులు నిర్వహించినా అక్కడ రియల్ వ్యాపా రానికి తెరలేపడం, విలువైన భూములపై కన్ను వేయడం రికార్డులను తారుమారు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. పెనుకొండలో పనిచేసే సమయంలో కియ కంపెనీ రావడం, ఆయన ఆక్రమభూదందాకు పెద్ద వరం లా మారింది. అక్కడి రైతుల భూములకు సంబంధించి లేనిపోని లోసుగులు చూపించి, బెదిరించి తన మాట వినేలా చేసుకుని తక్కువ ధరకే కోనుగోలు చేయడం, అధిక ధరకు మరొకరికి అమ్ముకుని కోట్లలో సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. అదే పంథాను ప్రస్తుతం చెన్నేకొత్తపల్లి మండలంలో కొనసాగిస్తున్నాడు. భూము లను కాజేయడం, వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడం ఆ అధికారికి పరిపాటిగా మారింది.
నకిలీ ఎనఓసీలు సృష్టిస్తూ...
తన అక్రమార్జన కోసం ఆ అధికారి నకిలీ ఎనఓసీలను సృష్టించడం మం డలంలో చర్చనీయాశంగా మా రింది. విలువైన అసైన్డు భూములు కనిపిస్తే ఆ రైతులను ఏదో రకంగా తమ వైపు తిప్పుకోని ఎనఓసీ ఇప్పిం చి మీభూ మిని మంచిరేటుకు అమ్మిస్తానని నమ్మబలికి పలువురిని మోసగించినట్లు తెలుస్తోంది. చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి రెవెన్యూ పొలంలో 271-3సర్వేనెంబర్‌లో 4.85 ఎకరాల అసైన్డు భూమికి నకిలీ ఎనఓసీ సృష్టించి ఏకంగా రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. చివరికి విషయం తెలుసుకున్న భూయాజమాని గట్టిగా నిలదీయడంతో రిజి సే్ట్రషన రద్దు చేయించి డీపట్టాగా మార్చినట్లు గ్రామస్థుల ద్వారా తెలిసింది.