మహిళపై హత్యాయత్నం

ABN , First Publish Date - 2021-12-15T05:59:21+05:30 IST

పట్టణంలోని లింగిశెట్టిపాళ్యంలో మంగళవారం ఓ మహిళపై నలుగురు మహిళలు కొడవళ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచినట్టు పోలీసులు తెలిపారు.

మహిళపై హత్యాయత్నం

ధర్మవరం, డిసెంబరు 14: పట్టణంలోని లింగిశెట్టిపాళ్యంలో మంగళవారం ఓ మహిళపై నలుగురు మహిళలు కొడవళ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు  తెలిపిన వివరాల మేరకు...పట్టణంలోని లింగి శెట్టిపాళ్యంలో నివసిస్తున్న శశిభూషణ్‌ భార్య తుమ్మల నీలమ్మపై అదే కాలనీ కి చెందిన మహిళలు నాగలక్ష్మీ, కుమారి, పద్మావతి కొడవలితో దాడిచేసి హత్యాయ త్నానికి పాల్పడ్డారు. తీవ్రగాయాలైన నీలమ్మను స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు.  నాగలక్ష్మీ సోదరుడు కుళ్లాయప్ప ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడని, ఇందుకు కారణం నీలమ్మ అనే అనుమానంతో కుళ్లాయప్ప సోదర ణిలైన ముగ్గురు మహిళలు నీలమ్మపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పో లీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.


Updated Date - 2021-12-15T05:59:21+05:30 IST