ప్రతీకార జ్వాల

ABN , First Publish Date - 2021-06-21T06:35:22+05:30 IST

జంటహత్యల నేపథ్యంలో యల్లనూరు మండలంలోని ఆరవీడులో ప్రతీకార దాడులు విధ్వంసానికి దారితీశాయి.

ప్రతీకార జ్వాల
ప్రతీకార దాడులకు పాల్పడుతున్న దృశ్యం

జంటహత్యలకు ప్రతీకారంగా నిందితుల 9 ఇళ్లు ధ్వంసం

300 పైగా చీనీచెట్ల నరికివేత... అరటి చెట్లు కూడా...

పోలీసుల అలసత్వమే కారణమా?

అదుపులో జంటహత్యల కేసులోని 13 మంది నిందితులు

ఆరవీడులోకి మీడియాను అనుమతించని డీఎస్పీ

వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం?

తాడిపత్రి/యల్లనూరు, జూన్‌20: జంటహత్యల నేపథ్యంలో యల్లనూరు మండలంలోని ఆరవీడులో ప్రతీకార దాడులు విధ్వంసానికి దారితీశాయి. మా మాఅల్లుళ్లు రాజగోపాల్‌, నారాయణప్పను ఈనెల 19న హత్య చేయడానికి ప్రతీకారంగా మృతుల కుటుంబసభ్యులు, బంధువులు, అనుచరులు కలిసి, బందోబస్తు పోలీసుల సాక్షిగా శనివారం అర్ధరాత్రి నిందితుల ఇళ్లు, తోటలను టార్గెట్‌ చేస్తూ విధ్వంసాలు సృష్టించి, అగ్నికి ఆహుతి చేశారు. పచ్చని చీనీచెట్లు, అరటి చెట్లను కొట్టివేశారు. మరికొన్నింటికి నిప్పటించారు. డ్రిప్‌పైపులతోపాటు ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. నిందితులకు చెం దిన మొత్తం 9 ఇళ్లలో నాలుగు పూర్తిగా కాలిపోయాయి. మరోరెండు ఇళ్లలోని ఫర్నిచర్‌ ధ్వంసం కాగా.. మూడు ఇళ్ల కప్పుపైభాగం కూలిపోయింది. రోడ్లపై ఉన్న వరికుప్పలు సైతం అంటించేందుకు ప్రయత్నించారు. డీఎస్పీ చైతన్య మా త్రం భిన్నంగా చెబుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు ఆగ్రహావేశాలతో పెట్రోల్‌ తీసుకుని, న్యాయం చేయకుంటే నిప్పటించుకుంటామని బందోబస్తు పోలీసులను బెదిరించారని డీఎప్పీ చెబుతున్నారు. వారికి సర్దిచెప్పి పంపించే ప్రయత్నంలో కొంతమంది ఇళ్లపై దాడులు చేశారన్నారు. ఇం దులో ఒక ఇల్లు మాత్రమే దెబ్బతిందనీ, పోలీసుల సమయస్ఫూర్తి వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. డీఎస్పీ చెబుతున్న దానికీ, వాస్తవ నష్టానికి చాలా వ్యత్యాసం  కనిపిస్తోంది. జంట హత్యలకు సంబంధించి మృతులు, నింది తులు వైసీపీకి చెందినవారే కావటంతో విధ్వంసాలు బయటి ప్రపంచానికి తెలియకుండా కప్పిపుచ్చేందుకే డీఎస్పీ చైతన్య విలేకరులను గ్రామంలోకి అనుమతించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


 బందోబస్తు ఉన్నా..

ఆరవీడులో దాదాపు 50 ఇళ్లున్నాయి. మూడు ప్రధాన వీధులున్నాయి. నిందితులకు సంబంధించి 9 ఇళ్లున్నాయి. జంటహత్యల అనంతరం ప్రతీకార దాడులు జరగకుండా అర్ధరాత్రి వరకు డీఎస్పీ చైతన్య, రూరల్‌ సీఐ మల్లికార్జున గుప్తాతోపాటు ఇద్దరు ఎస్‌ఐలు, 25 మంది కానిస్టేబుళ్లు బందోబస్తుగా ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత డీఎస్పీ, సీఐలు గ్రామం నుంచి రాగా మిగిలిన వారు బందోబస్తుగా ఉన్నారు. బందోబస్తుగా ఇద్దరు ఎస్‌ఐలు, 25 మంది కానిస్టేబుళ్లు ఉన్నప్పటికీ ఎలా ప్రతీకార దాడులు జరిగాయో అర్థంకాని పరిస్థితి. నిందితులకు సంబంధించి 9 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. ఒక్కో ఇంటికి ఇద్దరు కానిస్టేబుళ్ల చొ ప్పున, 4 ఇళ్లకు ఒక ఎస్‌ఐ కాపలాగా ఉన్నా విధ్వంసాలు నియంత్రించలేక పో యారు. డీఎస్పీ, సీఐలు వారిని బందోబస్తుగా పెట్టి, తాడిపత్రికి రావడంతో వీరు బందోబస్తుగా ఉన్నారా, తమకు ఏర్పాటుచేసిన బసలో నిద్రించారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. లేకుంటే ఇంత భారీస్థాయిలో  విధ్వంసాలు ఎలా జరుగుతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యల్లనూరు మండలంలో ఏచిన్న సంఘటన జరిగినా దానికి ప్రతీకార దాడులు జరుగుతాయన్న నానుడికి గతం లో జరిగిన అనేక ఘటనలు నిదర్శనాలు. అలాంటిది జంటహత్యలు జరిగాయం టే ఏ స్థాయిలో ప్రతీకార దాడులు జరుగుతాయోనన్న విషయం బందోబస్తు అధికారులకు తెలియదా.. తెలిసినా అశ్రద్ధ చేశారా అన్న విమర్శలు తలెత్తుతున్నాయి.


రోడ్లపై భారీగా వరికుప్పలు

జంట హత్యల అనంతరం నిందితులతోపాటు వారి కుటుంబాలు పరారు కావడంతో వారికి సంబంధించిన వరికుప్పలు భారీగా ఉన్నాయి. వంద బస్తాలకుపైగా వడ్లు రోడ్లపై ఆరబోశారు. మరికొన్నింటిని కుప్పలుగా వేశారు. వీటిని సైతం పెట్రోల్‌ పోసి, నిప్పంటించేందుకు బాధిత కుటుంబాలు ప్రయత్నం చేశాయి. కొన్నిచోట్ల కప్పిన టార్పాలిన్లు దెబ్బతిన్నాయి.


పోలీసు వలయంలో ఆరవీడు

హత్యకు గురైన వారు, నిందితులు అధికారపార్టీకి చెందిన వారు కావడంతో పోలీసులు ఆరవీడు గ్రామాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. మొత్తం ముగ్గు రు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, స్పెషల్‌పార్టీ సిబ్బంది, స్థానిక పోలీసులతో గ్రా మం పోలీసు వలయంగా మారింది. గ్రామానికి అటు, ఇటు ఉన్న రహదారిని పూర్తిగా మూసి వేశారు. గ్రామంలో నుంచి బయటకు, బయట నుంచి గ్రామంలోకి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామం పోలీసు వలయంగా మారడంతో తటస్థంగా ఉన్న వారి కుటుంబాలు బిక్కుబిక్కుమంటున్నాయి. పో లీసుల విచారణ జరుగుతుండటంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. ప్రతీకార దాడుల్లో ఎక్కడ తమపేరు చేర్చుతారోనన్న భయం వారి వె న్నులో వణుకు పుట్టిస్తోంది.


20 ఏళ్ల తర్వాత హత్యలు

ఆరవీడు గ్రామంలో 20 ఏళ్ల కిందట వ్యక్తిగత కారణాల తో ఒక వ్యక్తిని హత్య చేశారు. అప్పటి నుంచి ఒక కేసు కూడా నమోదుకాలేదు. గ్రామంలో 50 కుటుం బాలు మాత్రమే ఉన్నాయి. అతిచిన్న గ్రామం కావడంతో కక్షలకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం జంటహత్యలు తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలకు పరోక్షంగా పోలీసు, రెవెన్యూ అధికారులే కారణమన్న అభిప్రాయాలు లేకపోలేదు. బీరప్పమాన్యంను ఆక్రమించిన నాగే్‌షపై పోలీసు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుని ఉండుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఏడాదిన్నరగా జరుగుతున్న మాన్యం వివాదంలో వారు చూపిన నిర్లక్ష్య వైఖరే నేటి విధ్వంసానికి హేతువన్న అభిప్రాయం వినిపిస్తోంది.


పోలీసుల అదుపులో 13 మంది నిందితులు

జంటహత్యలకు సంబంధించి పోలీసుల అదుపులో 13 మంది నిందితులున్నారని సమాచారం. ఇప్పటికే 12 మందిని అదుపులోకి తీసుకున్నామని జం టహత్యల అనంతరం పోలీసులు రెండుబృందాలు గా ఏర్పడి గాలించారని డీఎస్పీ చైతన్య విలేకరులకు తెలిపారు. మరొకరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిని తాడిపత్రి సబ్‌డివిజన్‌లోని ఒక పోలీ్‌సస్టేషన్‌లో ఉంచి, తమదైన శైలి లో విచారణ చేస్తున్నారని తెలుస్తోంది.


పోలీసులతో వాగ్వాదానికి దిగిన బంధువులు

మృతిచెందిన వారిని కడచూపు చూసేందుకు కూడా వెళ్లకుండా అడ్డుకుంటారా అంటూ బందోబస్తు పోలీసుల తో బంధువులు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. తా డిపత్రి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో మామాఅల్లుళ్ల మృతదేహాలను ఆరవీడుకు తీసుకువచ్చారు. వారి అంత్యక్రియలకు వెళ్లేందుకు ఇతర గ్రామాల నుంచి వచ్చిన బంధువులను గ్రామంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, బంధువులకు మధ్య వాగ్వాదం తలెత్తింది. చివరికి ఉన్నతాధికారుల ఆదేశాలతో బంధువులను గ్రామంలోకి పంపించారు.


పోలీసుల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం?

బీరప్పస్వామి మాన్యం ఆక్రమణ, వివాదం నుంచి నేటి జంటహత్యలు, ప్రతీకార విధ్వంసాల్లో అడుగడుగునా కనిపిస్తున్న పోలీసు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కిందిస్థాయి సిబ్బందితోపాటు అధికారులు చేసిన పొరపాట్లు, చూపిన నిర్లక్ష్యం ఉన్నతాధికారులకు ఆగ్రహం తెప్పిస్తోంది. వైఫల్యాలను సరిదిద్దుకొనేందుకు అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జంటహత్యల్లో ప్రధాన నిందితుడైన నాగే్‌షతో సన్నిహిత సంబంధాలున్న యల్లనూరు పోలీ్‌సస్టేషన్‌లోని సిబ్బందిపై వేటు వేయనున్నారని సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించి జరిపిన పూర్తిస్థాయి విచారణలో కొందరు నాగే్‌షకు చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో ప్రత్యక్ష, పరోక్షంగా సహకారం అందించారని తేలింది. ఈ చనువు కారణంగానే బీరప్పమాన్యంను ఆక్రమించినా, అక్రమంగా బోర్లు వేసి నా, వాటిపై ఫిర్యాదు వచ్చినా నాగే్‌షపై చర్యలు తీసుకోలేదని విచారణలో తేలినట్లు సమాచారం.Updated Date - 2021-06-21T06:35:22+05:30 IST