తుంగభద్ర పరవళ్లు

ABN , First Publish Date - 2021-07-25T06:12:57+05:30 IST

తుంగభద్ర నది పరవళ్లు తొ క్కుతోంది.

తుంగభద్ర పరవళ్లు
జలకళ సంతరించుకున్న తుంగభద్ర డ్యాం

టీబీ డ్యాంకి భారీగా వరద నీరు

లక్షా నలభైవేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

క్రస్ట్‌గేట్ల ఎత్తివేతకు అధికారుల ఏర్పాట్లు

లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ

రాయదుర్గం, జూలై 24: తుంగభద్ర నది పరవళ్లు తొ క్కుతోంది. తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో లక్షా నలభైవేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో అవుతోంది. దీంతో జలాశయానికి ఉన్న క్రస్ట్‌గేట్లను ఎప్పుడైనా ఎత్తే అవకాశం ఉండటంతో బోర్డు అధికారులు లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసి, అప్రమత్తం చేశారు. వరదనీటి లభ్యతపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటికే జలాశయానికి అను బంధంగా ఉన్న కాలువలకు నీరు విడుదల చేశారు. హెచ్చెల్సీకి మాత్రం కర్ణాటక వాటా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి ఆంధ్రనీటి వాటా నీటిని కూడా విడుదల చేయాలని ఇండెంట్‌ సమ ర్పించడటంతో సా యంత్రం విడుదల చేశారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయానికి ఈ ఏడాది వరద నీరు భారీగా చేరుతుండటంతో అధికారులు అనుబంధ కాలువలకు నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జలాశయ ంలో 1625.96 అడుగుల మేర నీరు చేరి, 75.986 టీఎంసీలు నిల్వ  ఉంది. దీంతో కాలువలకు 7734 క్యూసెక్కు ల నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం తుంగ జలాశయం నుంచి లక్ష క్యూసెక్కుల వరకు నీరు విడుదలవుతోంది. జలాశయం ఎగువనున్న తుంగ నీటితోపాటు మధ్యలో కురుస్తున్న వర్షాల నీరు కలిసి 1.45 లక్షల క్యూసెక్కులు జలాశయంలోకి చేరుతోంది.


హెచ్చెల్సీకి ఆంధ్ర వాటా నీరు విడుదల

తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చల్సీ)కి ఆంరఽధా వాటా నీటిని శనివారం సాయంత్రం విడుదల చేశారు. నిన్నటి వరకు కాలువలో కర్ణాటక వాటా నీరు మాత్రమే విడుదల అవుతుండగా డ్యాం హెడ్‌లో ఆంధ్రా వాటా నీటిని కూడా విడుదల చేయడంతో నీటి మట్టం పెరుగుతూ వ స్తోంది. గంటకు వంద క్యూసెక్కుల దాకా నీటి మట్టాన్ని పెంచుతూ ఆంధ్రా నీటిని విడుదల చేస్తున్నారు. సరిహద్దులోని 105 కిలోమీటర్‌ వద్ద ఇప్పటికే కర్ణాటక నీరు షట్టర్లపై నుంచి ఆంధ్రాలోకి వస్తున్నాయి. ఆంధ్రా వాటా నీటిని విడుదల చేయడంతో బుధవారం ఉదయం నుంచి సరిహద్దులోని షట్టర్లను ఎత్తివేయనున్నారు. తొలుత వేయి క్యూసెక్కుల నీటిని సరిహద్దుల్లో ఆంధ్రా వాటాగా తీసుకునేలా చర్యలు తీసుకున్నారు. క్రమేపీ ఇండెంట్‌ని పెంచుకుంటూ 1800 క్యూసెక్కుల నీరు రోజూ తీసుకునేలా నిర్ణయించారు. గతేడాది కంటే ఈసారి జలాశయంలో ముందస్తుగా భారీగా నీటి చేరిక ఉండటంతో నీటి విడుదల కూడా ముందస్తుగా చేయాల్సి వచ్చింది. కాలువ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు కణేకల్లులోని చిక్కణ్ణేశ్వర స్వామి చెరువు నుంచి దిగువునున్న పీఏబీఆర్‌కు నీరు విడుదల చేసేందుకు ష ట్టర్ల మరమ్మతులు హుటాహుటిన చేపట్టారు. దీంతో నీటి విడుదల ఆలస్యం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.


క్రస్ట్‌గేట్ల ఎత్తివేతకు ఏర్పాట్లు

తుంగభద్ర జలాశయంలో భారీగా వరద నీరు చేరుతుండటంతో బోర్డు అధికారులు  క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువున శ్రీశైలం జలాశయానికి నీరు విడుదల చేయడానికి ఏ ర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 1.45 లక్షల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరుతోంది. రెండ్రోజుల్లో ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసి, నీటి విడుదలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. బోర్డు కార్యదర్శి నాగమోహన్‌ అధికారులతో  సమీక్షిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడూ అంచనా వేసి, 90 టీఎంసీల నీరు జలాశయానికి చేరిన వెంటనే క్ర స్ట్‌గేట్లను ఎత్తేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. వంద టీఎంసీల సామర్థ్యం ఉన్న జలాశయంలో ఇప్పటికే 75 టీఎంసీల నీరు చేరాయి. మరో 24 గంటల్లో 90 టీఎంసీలకు చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీం తో క్రస్ట్‌గేట్ల ద్వారా నదికి జలాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2021-07-25T06:12:57+05:30 IST