కారుణ్య నియామకాల్లో కాసుల కక్కుర్తి

ABN , First Publish Date - 2021-05-30T05:47:22+05:30 IST

ప్రభుత్వోద్యోగి మరణిస్తే కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తుంది.

కారుణ్య నియామకాల్లో కాసుల కక్కుర్తి
సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయం

అక్కడ ప్రతి పనికీ ఓ రేటు.. సాంఘిక సంక్షేమ శాఖలో అక్రమాల బాగోతం

అనంతపురం క్లాక్‌టవర్‌, మే 29: ప్రభుత్వోద్యోగి మరణిస్తే కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తుంది. అందుకు తగిన నిబంధనలు పెట్టింది. వాటికి లోబడే కారుణ్య నియామకాలు చే పట్టాల్సి ఉంటుంది. సాంఘిక సంక్షేమ శాఖలో ని బంధనలకు తిలోదకలు ఇచ్చి, సొంత నిర్ణయాలు, స్వార్థ ప్రయోజనాలు, ముడుపులతో ఇష్టారీతిలో ఉ ద్యోగాలు ఇచ్చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జిల్లా కలెక్టర్‌, ఉన్నతాధికారులను సైతం పక్కదారి పట్టిస్తూ యథేచ్ఛగా నియామకాలు చేపడుతున్నారు. ఇక్కడ ప్రతిపనికీ ఓ రేటు ఉం టుంది. ఆ రేటు ప్రకారం ముడుపులు ఇస్తేనే పనులు జరుగుతాయనే ప్రచారం ఆ శాఖలో జోరుగా వినిపిస్తోం ది. ఇప్పటికే వార్డెన్ల అక్రమ డెప్యుటేషన్లు, సస్పెండైన వార్డెన్లను తిరిగి అక్కడే నియమించడం వంటి వ్యవహారాలపై అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో కా రుణ్య నియామకాల్లో అక్రమాలు తెరపైకి వస్తున్నాయి. బాధితులు ఒక్కొక్కరుగా తమకు అన్యా యం వాటిల్లిందంటూ కార్యాలయానికి వచ్చి, ఆవేదన వ్యక్తం చేస్తుండటమే ఇందుకు నిదర్శనం.


19 మందికి కారుణ్య నియామకాలు 

సాంఘిక సంక్షేమశాఖలో ఉద్యోగులు చనిపోగా కు టుంబ సభ్యులకు ఇచ్చే కారుణ్య నియామకాలు 10 మందికి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో మరణించిన 9 మంది బాధిత కుటుంబాలలో ఉద్యోగాలు కల్పించారు. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓ ఉద్యోగి చనిపోతే అర్హతలు లేకున్నా, వయస్సు ఎక్కువ ఉన్నా కారుణ్య నియామకం ఇచ్చేశారు. జిల్లా కేంద్రంలో ఓ ఉద్యోగి చనిపోవడంతో బాధితుడి భార్యకు అర్హతలు, వయస్సు, కేటగిరీ ఉ న్నప్పటికీ నిబంధనల ప్రకారం ఉద్యోగం ఇవ్వకుండా కిందిస్థాయి సబార్డినేటర్‌గా నియమించారు. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓ ఉద్యోగి చనిపోవడంతో బాధిత కుటుంబసభ్యులలో విద్యార్హత, వయసు లేకపోయినా జిల్లా కేం ద్రంలో నియామకం ఇచ్చారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్ర మే. ఇలాంటివి జిల్లాలో చాలానే ఉన్నాయని ఆ శాఖలోనే చర్చించుకుంటున్నారు. జిల్లా కేంద్ర కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి, ఇద్దరు ఉద్యోగులు ఈ అక్రమాలలో భాగస్వాములైనట్టు తెలుస్తోంది. ఇక్క డ ఏ పని జరగాలన్నా వారి చేయి తడపాల్సిందే. ప్రతి పనికీ ఓ రేటు ఇక్కడ నడుస్తోంది. అసలే కరోనా సమయంలో కనీస మానవత్వం కూడా లే కుండా కారుణ్య నియామకాల్లోనూ కాసుల కక్కుర్తి ప్రదర్శిస్తున్నారంటూ బహిరంగంగా విమర్శలు వస్తున్నాయి.


అట్రాసిటీ కేసుల నమోదులోనూ నిర్లక్ష్యం

1955లో తీసుకువచ్చిన పౌరహక్కుల చట్టం, 1989లో ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల పై ప్రతి ఒక్కరికీ కచ్చితంగా కనీస అవగాహన కల్పించాల్సిన బాధ్యత సాంఘిక సంక్షేమ శాఖపై ఉంది. రెవెన్యూ, పోలీసు, వెల్ఫేర్‌ శాఖల సమన్వయంతో అట్రాసిటీ కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు శిక్షపడేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 427 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. అట్రాసిటీ కేసులను తగ్గించి, బాధితులకు భరోసా కల్పించాలి. ఇవేవీ అమలు చేయకుండా అట్రాసిటీ కేసులను గుర్తించడంలోనూ, బాధితులకు న్యాయం చేయడంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కే సుల్లో బాధితులకు ప్రభుత్వం తరపున ఉద్యోగం గానీ, ఉపాధిగానీ కల్పించాల్సిన ని బంధనలను తుంగలో తొక్కుతున్నారు. వారి గురించి పట్టించుకోవట్లేదన్న విమర్శలు మూ టగట్టుకుంటున్నారు.


నిబంధనలకు లోబడే నియామకాలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కారుణ్య నియామకాలు చేపడుతున్నాం. ఇప్పటి వరకు 19 మందికి ని యామకాలు ఇచ్చాం. ఇందులో 10 మంది ఉద్యోగి చనిపోతే కుటుంబ సభ్యులకు, మరో 9 మందికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు ఉద్యోగాలు కల్పించాం. ప్రభుత్వ ఆమోదంతోనే నియామకాలు చేప ట్టాం. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పర్యవేక్షణకు మానిటరింగ్‌ కమిటీ సభ్యులను సమన్వయం చేసుకుని, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం.         

 - విశ్వమోహన్‌రెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ డీడీ

Updated Date - 2021-05-30T05:47:22+05:30 IST