ఏఎస్పీ నాగేంద్రుడు, సీఐ తేజోమూర్తి బదిలీ

ABN , First Publish Date - 2021-01-27T07:03:17+05:30 IST

జిల్లా పోలీసుశాఖలో పనిచేస్తున్న ఏఎస్పీ నాగేంద్రుడు, తాడిపత్రి సీఐ తేజోమూర్తిని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేస్తూ మంగళవారం ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఏఎస్పీ నాగేంద్రుడు, సీఐ తేజోమూర్తి బదిలీ

డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేసుకోవాలని ఆదేశం

అనంతపురం క్రైం, జనవరి 26: జిల్లా పోలీసుశాఖలో పనిచేస్తున్న ఏఎస్పీ నాగేంద్రుడు, తాడిపత్రి సీఐ తేజోమూర్తిని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేస్తూ మంగళవారం ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో చిత్తూ రు జిల్లా శ్రీకాళహస్తి డీఎస్పీగా పనిచేస్తున్న ఏఎస్పీ నాగేంద్రుడు, తాడిపత్రి సీఐగా పనిచేస్తున్న తేజోమూ ర్తి గతంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై ఉదాసీనంగా వ్యవహరించటం, కోడ్‌ అమలు చేయటంలో పలు ఆరోపణల నేపథ్యంలో వారిద్దరిని తాజా ఎన్నికల విధుల నుంచి తప్పించినట్లు తెలిసింది. మూడు రోజుల కిందట రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వీరిద్దరిని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వి షయం తెలిసిందే. దీంతో వీరిద్దరూ ప్రస్తుత విధుల నుంచి రిలీవయ్యారు. నేడోరేపో డీజీపీ కార్యాలయంలో రిపో ర్టు చేసుకోనున్నట్లు ఆ శాఖ వర్గాల నుంచి తెలిసింది.

Updated Date - 2021-01-27T07:03:17+05:30 IST