ఎన్నికలు ముగిసినా.. అందని నజరానా..

ABN , First Publish Date - 2021-02-26T06:36:01+05:30 IST

‘పంచాయతీలను ఏకగీవ్రం చేసుకుందాం.. గ్రామాభివృద్ధికి సో పానాలు వేసుకుందామం’టూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు భారీ స్థాయిలో నజరానాలను ఆర్భాటంగా ప్రకటించింది.

ఎన్నికలు ముగిసినా.. అందని నజరానా..

జిల్లాకు రావాల్సిన ఏకగ్రీవాల సొమ్మురూ.2.90 కోట్లు

నేటికీ అందని వైనం

నిధుల కోసం ఎదురుచూపులు

అనంతపురం, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ‘పంచాయతీలను ఏకగీవ్రం చేసుకుందాం.. గ్రామాభివృద్ధికి సో పానాలు వేసుకుందామం’టూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు భారీ స్థాయిలో నజరానాలను ఆర్భాటంగా ప్రకటించింది. అమలును మాత్రం మరచిపోయింది. ఎన్నికలు ముగిశాయి. నూతన సర్పంచ్‌లు కొలువుదీరారు. ప్రమాణ స్వీకారాలు చేరారు. బాధ్యతల్లో చేరిపోయారు. మొత్తం ప్రక్రియే ముగిసింది. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన నజరానా మాత్రం నేటికీ అందట్లేదు. ప్రభుత్వం ప్రకటించిన నజరానాల కోసం ఏకగ్రీవ పంచాయతీలకు ఎదురుచూపులే మిగిలా యి. అసలే పంచాయతీల్లో నిధుల్లేకపోవటంతో పాలన గాడి తప్పుతున్న తరుణంలో నజరానా నిధులు పంచాయతీ అభివృద్ధికి తోడ్పాటునందిస్తాయని ఆయా ఏకగ్రీవ పంచాయతీల సర్పంచ్‌లు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు కొలువుదీరుతున్నారు. ఇప్పటికీ.. నజరానా నిధులు అందివ్వలేదు. అదేమని అధికారులను అడిగితే.. ప్రభుత్వం నుంచి నిధులు రాలేదని సంబంధిత అధికారులు సమాధానమిస్తుండటం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే.. నజరానా నిధుల మంజూ రు మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 44 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 2 వేలలోపు జనాభా ఉన్నవి 24, రెండు వేల నుంచి 5 వేలలోపు జనాభా కలిగినవి 14, ఐదు వేలకుపైబడినవి 2 ఉన్నాయి. ఈ లెక్కన ప్రభుత్వం ప్రకటించిన నజరానాల మేరకు.. జిల్లాకు రూ.2.90 కోట్ల నిధులు మంజూరు చేయాల్సి ఉంది. అవి ఏకగ్రీవ పంచాయతీల అభివృద్ధికి కొంత ఉపకరించనున్నాయి. మరి నిధులు ఎప్పుడు మంజూరవుతాయో వేచి చూడాల్సిందే.


ప్రోత్సాహకాల వివరాలివీ...

గ్రామ పంచాయతీల సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను మరింత పెంచుతున్నట్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పంచాయతీల జనాభా ఆధారంగా ప్రోత్సాహకాలను పెంచింది.


2 వేలలోపు జనాభా ఏకగ్రీవ పంచాయతీలివీ..

జిల్లావ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో 2 వేలలోపు జనాభా కలిగిన 24 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో మండలాల వారీగా పరిశీలిస్తే.. సింగానహళ్లి (బొమ్మనహాళ్‌), బోరంపల్లి, ఎం. కొండాపురం (కళ్యాణదుర్గం), అరవకూరు (కూడేరు), కొండకింద తండా (నల్లమాడ), తు మ్మలబయలు (గాండ్లపెంట), నిట్టూరు, వెంకటాంపల్లి, సింగవరం, గొడ్డుమర్రి (యల్లనూరు), కొండేపల్లి, చెర్లోపల్లి (పుట్లూరు), వెంకటరెడ్డిపల్లి (తాడిపత్రి), అప్పేచెర్ల (పెద్దవడుగూరు), తంభాపురం (బత్తలపల్లి), లింగారెడ్డిపల్లి (కొత్తచెరువు), సీసీ కొత్తకోట (ధర్మవరం), రామస్వామి తండా, గాండ్లవారిపల్లి, చిన్నకోట్ల (ముదిగుబ్బ), మదిరేపల్లి తండా (బుక్కపట్నం), ధర్మాపురం, వన్నేదొడ్డి (గుత్తి), జి. కొట్టాల (గుంతకల్లు) పంచాయతీలున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మేరకు.. ఒక్కో పంచాయతీకి రూ.5 లక్షల ప్రోత్సాహకం అందజేయాల్సి ఉంది. ఈ లెక్కన రూ.1.20 కోట్లు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం రూపంలో ఆయా పంచాయతీలకు అందాల్సి ఉంది. 


5వేలలోపు జనాభా ఏకగీవ్ర పంచాయతీలివీ...

జిల్లాలో ఏకగ్రీవమైన పంచాయతీల్లో 5 వేలలోపు జనాభా కలిగినవి 14 ఉన్నాయి. వీటిలో దాదులూరు (కనగానపల్లి), కరిడికొండ (గుత్తి), పులగుట్టపల్లి (గుంతకల్లు), కరకముక్కల (విడపనకల్లు), చెర్లోపల్లి (పుట్టపర్తి), కలహళ్లి (బొమ్మనహాళ్‌), ఏపులపర్తి(బ్రహ్మసముద్రం), బొమ్మేపర్తి (రాప్తాడు), నిదనవాడ (శింగనమల), చెదల్ల (బుక్కరాయసముద్రం), ముత్యాలచెరువు (కదిరి), బుక్కాపురం, చింతకాయమంద (యల్లనూరు), డి. చెర్లోపల్లి (బత్తలపల్లి) పంచాయతీలున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మేరకు.. ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహకం అందజేయాల్సి ఉంది. ఈ లెక్కన రూ.1.40 కోట్లు ప్రభుత్వం నుంచి ప్రో త్సాహకం రూపంలో ఆయా పంచాయతీలకు అందాల్సి ఉంది.


10 వేలలోపు జనాభా ఏకగ్రీవ పంచాయతీలివీ..

జిల్లాలో 10 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీల్లో ఏకగ్రీవమైన వాటిలో రెండు పంచాయతీలున్నాయి. ఇందులో మండలాల వారీగా... బత్తలపల్లి (బత్తలపల్లి), కొనకొండ్ల (వజ్రకరూరు) పంచాయతీలున్నాయి. ప్ర భుత్వం ప్రకటించిన మేరకు.. ఒక్కో పంచాయతీకి రూ.15 లక్షల చొప్పున ప్రోత్సాహకం అందజేయాల్సి ఉంది. ఈ లెక్కన రూ.30 లక్షలు ఆయా పంచాయతీలకు నిధులు విడుదల చేయాల్సి ఉంది.

Updated Date - 2021-02-26T06:36:01+05:30 IST