అందరూ పాస్
ABN , First Publish Date - 2021-07-24T06:24:09+05:30 IST
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జిల్లాలో అందరూ పాసయ్యారు. 2021 మార్చి పరీక్షల ఫీజు చెల్లించిన వారందరినీ ప్రభుత్వం పాస్ చేసింది.

ఇంటర్ సెకెండియర్లో కరోనాతో 100ు ఉత్తీర్ణత
పదిలో 30, ఫస్ట్ ఇయర్లో
70 శాతం మార్కులతో ఫలితాలు
ఎంపీసీ, బైపీసీల్లో 988 టాప్ మార్కులు
ఎంపీసీలో నివేదిత, గణే్‌షకు అత్యధికం
బైపీసీలో లీనాభాస్కర్కు..
ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు అవకాశం: ఆర్ఐఓ
అనంతపురం విద్య, జూలై 23: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జిల్లాలో అందరూ పాసయ్యారు. 2021 మార్చి పరీక్షల ఫీజు చెల్లించిన వారందరినీ ప్రభుత్వం పాస్ చేసింది. కరోనా కారణంగా ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసిన విషయం విదితమే. పదో తరగతిలో 30 శాతం, ఫస్ట్ ఇయర్లో 70 శాతం మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 33,257 మంది వి ద్యార్థులు ఉత్తీర్థత సాధించారు. ఇందులో జనరల్ 30,543, ఒకేషనల్ 2,714 మంది ఉన్నారు. ఈ ఏడాది ప్రాక్టికల్ పరీక్షల్లో ఫెయిల్ మార్కులు వచ్చిన వారికీ మినిమం పాస్ మార్కులు వేసి, ఉత్తీర్ణులను చేశారు.
బాలురు 16,630.. బాలికలు 16627 మంది..
జిల్లావ్యాప్తంగా ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షల్లో రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు 33,257 మంది పాస్ అయ్యారు. ఇందులో బాలురు 16630 మంది, బాలికలు 16627 మంది ఉన్నారు. వీరిలో సైన్స్ విద్యార్థులు 18,495 మంది, ఆర్ట్స్‌కు సంబంధించి 11,535 మంది కలిపి మొత్తం 30,030 మంది, ప్రైవేటు విద్యార్థులు మరో 513 మంది ఉన్నారు. ఒకేషనల్ రెగ్యులర్ 2,686 మంది, ప్రైవేటు విద్యార్థులు 28 మంది ఫీజు చెల్లించారు. ఏప్రిల్‌లో నిర్వహించిన ప్రాక్టికల్స్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులను సైతం మినిమం పాస్ మా ర్కులు వేసి, పాస్ చేశారు. 2021 ఏడాది పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేశారు.
టెన్త్+ఇంటర్ ఫస్ట్ ఇయర్..
ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలకు టెన్త్, ఇంటర్ మొదటి సంవత్సర మార్కులను ఆధారంగా చేసుకున్నారు. పదో తరగతిలో విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించిన 3 సబ్జెక్టుల మార్కుల్లో 30 శాతం, ఇంటర్ మొదటి ఏడాది సాధించిన మార్కుల్లో 70 శాతం వెయిటేజీ తీసుకుని, ఫలితాలను ప్రకటించారు. ఎంపీసీలో నగరంలోని నారాయణ కళాశాలకు చెందిన నివేదిత, గణేష్ 1000కి 988 మార్కులతో జిల్లా టాపర్లుగా నిలిచారు. బైపీసీలో శ్రీచైతన్య కళాశాల విద్యార్థిని లీనాభాస్కర్ 988 మార్కులతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
ఇంప్రూవ్‌మెంట్‌కు అవకాశం
ఇంటర్ సెకెండ్ ఇయర్-2021 ఫలితాల్లో ప్రకటించిన మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులకు మరో అవకాశం ఉంటుందని ఆర్ఐఓ వెంకటరమణనాయక్ తెలిపా రు. ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసుకోవచ్చన్నారు. ఆ తేదీల వివరాలు రాగానే సమాచారం ఇస్తామన్నారు.
ఐఈడీ దివాకర్‌రెడ్డి కుమార్తెకు 985 మార్కులు
సమగ్రశిక్ష ప్రాజెక్టులో సహిత విద్య (ఐఈడీ) జిల్లా సమన్వయకర్తగా పనిచేసే దివాకర్‌రెడ్డి కుమార్తె లాస్యకు 985 మార్కులు వచ్చాయి. విజయవాడలోని శ్రీచైతన్యలో లాస్య చదువుతోంది. పదిలో 10కి 10 జీపీఏ సాధించి, ఇంటర్ మొదటి ఏడాదిలో 462 మార్కులు వచ్చాయని దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు.