97 మంది గ్రేడ్-2 హెచ్‌ఎంల బదిలీ
ABN , First Publish Date - 2021-03-21T06:30:15+05:30 IST
జిల్లావ్యాప్తంగా 97 మంది గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు బదిలీ అయ్యారు.

అనంతపురం విద్య, మార్చి 20: జిల్లావ్యాప్తంగా 97 మంది గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు బదిలీ అయ్యారు. ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా వారు దరఖాస్తు చేసుకున్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రక్రియను ఆపే శారు. ఎన్నికలు ముగియటంతో బదిలీల ప్రక్రియను పూర్తి చేశారు. గ్రేడ్-2 హెచ్ ఎంలకు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలపై ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ జడ్పీ స్కూళ్ల హెచ్‌ఎంల బదిలీల ఉత్తర్వులు ఇచ్చామన్నారు. తిరుపతిలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వ యాజమాన్య స్కూళ్ల హెచ్‌ఎంల ఉత్తర్వులు వెలువరించాల్సి ఉందన్నారు. కోడ్ ముగియగానే ఇస్తామన్నారు.