అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-12T06:49:46+05:30 IST

నగర పంచాయతీ పరిధి లోని మల్లినాయకనపల్లి గ్రామానికి చెందిన రైతు హనుమంతరెడ్డి(38) అప్పుల బాధ తాళలేక సోమవారం ఆత్మహత్య చేసుకొన్నాడు.

అప్పుల బాధతో  రైతు ఆత్మహత్య
హనుమంతరెడ్డి (ఫైల్‌ఫొటో)

మడకశిర, జనవరి 11 : నగర పంచాయతీ పరిధి లోని మల్లినాయకనపల్లి గ్రామానికి చెందిన రైతు హనుమంతరెడ్డి(38) అప్పుల బాధ తాళలేక సోమవారం  ఆత్మహత్య చేసుకొన్నాడు. బంధువులు తెలిపిన మేరకు హనుమంతరెడ్డికి తమ్ముడికి కలిపి రెండెకరాల పొలం ఉంది. అప్పులు చేసి పొలంలో వేరుశనగ పంట సాగు చేసే వారు. ప్రతి ఏడాది పంట దెబ్బతినడంతో పెట్టుబడులు కూడా దక్కక అప్పులే మిగిలేవి. ఇటీవలే అప్పుచేసి బోరు బావి తవ్వించాడు. అందులో కూడా నీరు సరిగ్గా పడలేదు. కుమార్తె వివాహానికి, పంటల సాగుకు చేసిన అప్పులు రూ.4 లక్షలకు చేరాయి. దీంతో వాటిని తీర్చే మార్గం కానరాక సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైకప్పునకు ఉరి వేసుకున్నాడు. ఇతడికి భార్య జయమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఎస్‌ఐ శేషగిరి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-01-12T06:49:46+05:30 IST