కల్తీతో గల్తీ పనులు

ABN , First Publish Date - 2021-07-12T06:26:03+05:30 IST

జిల్లాలోని ఆహార భద్రతా శాఖలోని కొందరు సిబ్బంది అడ్డూఅదుపులేకుండా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.

కల్తీతో గల్తీ పనులు
జిల్లా కేంద్రంలోని ఆహార భద్రతాశాఖ కార్యాలయం

ఆహార భద్రతా శాఖలో కట్టుతప్పిన వ్యవహారం

తనిఖీలు, చర్యల పేరుతో బెదిరింపులు

అడిగినంత ఇస్తే సరే... లేకుంటే కేసులతో దాడి

శాంపిళ్ల సేకరణ పేరుతో అక్రమ వసూళ్లు 

జిల్లాలో పెరిగిన కల్తీ వ్యాపారం

అనారోగ్యం పాలవుతున్న ప్రజలు

అనంతపురం క్రైం, జూలై 11: జిల్లాలోని ఆహార భద్రతా శాఖలోని కొందరు సిబ్బంది అడ్డూఅదుపులేకుండా  అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎక్కడైనా ప్రజలకు అందించే ఆహార పదార్థాల్లో కల్తీ జ రుగుతుంటే స్పందించి, నాణ్యమైన ఆహారం అందించేలా చూడాల్సిన బాధ్యత ఆహార భద్రత శాఖపై ఉంది. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి శాంపిళ్లు ల్యాబ్‌లకు పంపాలి. అందులో జరిగిన కల్తీ ఆధారంగా శాఖపరమైన చర్యలు తీసుకోవడం ఆశాఖ విధి. అయితే జిల్లాలో అందుకు భిన్నంగా ప్ర స్తుత పరిస్థితి ఉంది. ఆశాఖలో పనిచేస్తున్న కొందరు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో తనిఖీల పేరుతో పెద్దఎత్తున మామూళ్లకు దిగుతున్నారనేది బహిరంగంగా వినిపిస్తోంది.  కొందరు వ్యాపారులు, యూనియన్‌ నాయకులు ఏజెంట్లుగా మారి తెరవెనుక దందా సాగిస్తున్నారని సమాచారం. తోటి వ్యాపారుల వద్దకు వెళ్లి వసూలు చేయడం.. ఆ మొత్తాన్ని ఆ శాఖలోని కొం దరు అధికారులు, సిబ్బందికి అందిస్తున్నారు.  హో టళ్లు, రెస్టారెంట్‌లు, తదితర దుకాణా ల కు చెందిన నిర్వాహకులు ఎవరైనా మామూళ్లు ఇ వ్వకపోతే వారి వివరాలను జాబితాలో నమోదు చేసి ఆ అధికారులకు అందజేస్తారు. దీంతో ఆ శాఖ అధికారులు వెంటనే ఆ హోటల్‌ లేదా రెస్టారెంట్‌, దుకాణాల వద్దకు వెళ్లడం హడావుడితో తనిఖీలు చేసి శాంపిళ్లు తీసి చకచక కేసులు నమోదు చేస్తున్నారు. వసూళ్లే కాదు.. అప్పుడుప్పుడు అదనంగా సమర్పించాల్సిందే.  ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా ఆ వ్యా పారి వ్యాపారం చేసుకోవడానికి వీల్లేని విధంగా పరిస్థితులు సృష్టిస్తారు. ఇలా జిల్లాలో చాలా ప్రాంతాల్లో కొందరు వ్యాపారులపై ఇలా జరగడంతో బాధిత వ్యాపారులు ఆశాఖ ఉన్నతాధికారులకు ఇది వరకే ఫిర్యాదు చేసినట్లు సమాచారం.  


కల్తీకి కట్టడేదీ? 

జిల్లాలో తినుబండారాలు తయారీ నుంచి వండే వంటల వరకు ఎక్కడికక్కడ కల్తీ ఇష్టారాజ్యంగా పెరిగిపోతోంది. తోపుడుబండ్ల నుంచి పెద్దపెద్ద రెస్టారెంట్‌లు, ఖరీదైన హోటళ్ల వరకు కల్తీనే. జిల్లాలో ఇం తలా కల్తీ తాండవిస్తున్నా ఇదేంటనీ ప్రశ్నించే వారే కరువయ్యారు. జిల్లాలోని అనంతపురం నగరంతో పా టు హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుకొండ, కదిరి తదితర ప్రాంతా ల్లో మటన్‌, చికెన్‌, తదితర నాన్‌వెజ్‌ వంటకాలలో కల్తీ హెచ్చుమీరుతోంది. ఆనారోగ్యంతో పాటు ఇతర త్రా కారణాలతో చనిపోయిన కోళ్లు, వాటి అవయవాలను సేక రించి చికెన్‌ పకోడీ, లెగ్‌పీస్‌, బోన్‌ లెస్‌ కబాబ్‌ తదితర వంటివి చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పొట్టేలు, గొర్రెల మాంసంలో కూడా ఇదే వైఖరే కొనసాగుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసాన్ని వాడుతున్నారు.  నగరం నడిబొడ్డున ఓ ప్రధాన హోటల్‌లో ఆకస్మిక తనిఖీలు చేయడంతో ఇదే విషయం బయటపడింది. ఇలాంటివి జిల్లాలో చాలా వరకు కేసులు నమోదయ్యాయ ని తెలిసింది. కానీ ఆశించిన స్థాయిలో వాటిపై చర్యలు తీసుకోకుండా చేతివాటం ప్రదర్శించి వదిలేశారని సమాచారం. 


 తక్కువ ధరలతో దోపిడీ 

తక్కువ పెట్టుబడి, కల్తీ పదార్థాలతో తినుబండారాలు తయారు చేసి ప్రజలకు వాటిని అంటగట్టి చాలామంది సొమ్ము చేసుకుంటున్నారు. ఉదాహరణకు.. న గరంలో ఎక్కడ చూసినా మటన్‌ కేజీ - రూ.700 నుంచి రూ.1000, చికెన్‌  కేజీ రూ. 250 నుంచి రూ. 300 వరకు మార్కె ట్‌లో ధర పలుకుతోంది. ఈ క్ర మంలో కొందరు దుకాణా లు, బిరియా ని సెంటర్‌ల నిర్వాహకులు కల్తీ పదార్థాలతో రుచికరంగా బిరియానీలు తయారు చేసి ప్యాకెట్‌ రూ.50 నుంచి రూ.100, రూ. 120 చెప్పున విక్రయిస్తుండటం కలవరం కలిగిస్తోంది. ఇంత తక్కువ ధరకే అందిస్తున్నారంటే ఇందు లో ఏ తరహా మాంసం వాడారో కూడా అం తుచిక్క ని పరిస్థితి. రోడ్డుపక్కన వ్యాపారులే కాదు.. పెద్దపెద్ద హోటళ్లు, రెస్టారెంట్‌లు, డాబాలలో కూడా ఇదే దుస్థితి. చివరికి పానీపూరి, గోబీ, నూడిల్స్‌ తదితర వంట కాల్లోనూ ఇదే కల్తీ  సాగుతోంది. శుద్ధిలేని నీటి తో పాటు వాటి తయారీకి వినియోగించే నూనె తదితర సామగ్రిలోనూ నాణ్యతాలోపం కనిపిస్తోంది. కూ ల్‌డ్రింక్‌, జ్యూస్‌ షాపుల్లో కుళ్లిన పండ్లను వేసి క్యాష్‌ చేసుకుంటుండటం మరింత కలవరం రేపుతోంది. కానీ తక్కువ ధరలకు లభిస్తోందనే భావనతో కొంద రు మాంసప్రియులు, భోజన ప్రియులు వాటిని ఇష్టం గా తిని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇలా పలు రూపాలలో ఆహార పదార్థాల్లో కల్తీతో పాటు నాసిరకం స్పష్టంగా కనిపి స్తున్నా జిల్లా ఆహా ర భద్రతా శాఖ అధికారులు ఆవైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.  అక్ర మ వసూళ్లలో పడి మిన్నకుండిపోవడం పలు విమర్శల కు తావిస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు ఎవరైనా స మయం వచ్చినప్పుడు ప్రశ్నిస్తే సిబ్బంది కొరత చూ పించి తప్పించుకుంటున్నట్టు  ఆ శాఖ వర్గాల నుంచి తెలిసింది. 


 ఇద్దరు అధికారుల తీరుపై విమర్శలు...

జిల్లా ఆహార భద్రతా శాఖలో పనిచేస్తున్న ఇద్దరు అధికారుల తీరుపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ శాఖ ఉన్నతాధికారుల కంటే అంతా తామే అన్నట్టుగా  వ్యవహరిస్తున్నారనే విషయంపై ఆ శాఖలో చర్చ సాగుతోంది. బయట సమాజంలో కూడా ఇదే జరుగుతోందని భావ న. ఆ శాఖ ఉన్నతాధికారికంటే కూడా ఈ ఇద్దరు అధి కారులంటేనే ఆయా నిర్వాహకులు, యూ నియన్‌ నాయకులకు కూడా భ యం ఉందనే ప్రచారం లేకపోలేదు.  ఆ ఇద్దరు అధికారులు, ఆ శాఖ సిబ్బంది ఎక్కడ దాడులు చేసినా అంతే సంగతులు. ఎంతో కొంత చేతికి రాకుండా తిరిగి రారని ప్రచారం కూడా లేకపోలేదు. కరోనా సమయంలో ఎక్క డా ఆశాఖ అధికారులు తనిఖీలు ఆశించిన స్థాయిలో చేసిన దాఖలాలు లేవు. ఇదే అదునుగా భా వించి ఆయా ప్రాంతాల వారిగా అనుమతి పొందిన హోటళ్లు, రె స్టారెంట్‌లు, డాబాల నుంచి ఈ ఇద్దరు అధికారులతో పాటు కొందరు సిబ్బంది పెద్దఎత్తున ఆ మ్యామ్యాలు పుచ్చుకున్నట్లు స మాచారం. కొన్ని ప్రాంతాల్లో నేరుగా ఆయా నిర్వాహకులతో కాంటాక్ట్‌ కావడం.. మరికొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు, యూనియన్‌ నాయకుల ద్వారా తెర వె నుక కాసుల దందా సాగించారని కొందరు బాధితుల ఆవేదన. జిల్లాలోని బార్‌లు, రెస్టారెంట్‌లు, హో టళ్లు, పలు దుకాణాలకు ఆహార భద్రతా శాఖ అంటే దడ పుట్టించే విధంగా ఆ శాఖలోని కొందరు అధికారులు, సిబ్బంది వ్యవరిస్తుండటం జిల్లాలో కలవరం రేపుతోంది. పైగా సిబ్బంది కొరత కూడా ఉండటంతో అవినీతి అధికారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. ఎక్కడికక్కడ వసూళ్ల దందాకు తెరలేపడంతో బాధిత వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి  ప్రజలు కల్తీ ఆహారంతో ఆనారోగ్యం బారినపడకుండా అవినీతి ఉద్యోగులు, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2021-07-12T06:26:03+05:30 IST