సీపీఎస్‌ రద్దుకు రెండు చోట్ల వేర్వేరుగా ర్యాలీ, సభలు

ABN , First Publish Date - 2021-09-02T06:19:34+05:30 IST

కంట్రిబ్యూటరీ పెన్షన స్కీమ్‌(సీపీఎస్‌)ను రద్దు చేయాలని, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమరభేరి మోగించారు.

సీపీఎస్‌ రద్దుకు  రెండు చోట్ల  వేర్వేరుగా ర్యాలీ, సభలు
ధర్నాకు భారీగా హాజరైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు

సీపీఎ్‌సపై సమరభేరి

సీపీఎస్‌ రద్దుకు  రెండు చోట్ల  వేర్వేరుగా ర్యాలీ, సభలు

భారీగా తరలివచ్చిన ఉద్యోగులు, టీచర్లు

వారంలో రద్దు చేస్తామన్న హామీకి రెండున్నరేళ్లు..

 స్వాతంత్య్ర పోరాట  పటిమ చూపి, సాధించుకుంటాం

ఏపీసీపీఎ్‌సఈఏ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు

సీఎం జగన్‌ఇచ్చిన మాట నిలుపుకోవాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

అనంతపురం విద్య, సెప్టెంబరు 1: కంట్రిబ్యూటరీ పెన్షన స్కీమ్‌(సీపీఎస్‌)ను రద్దు చేయాలని, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమరభేరి మోగించారు. తాము బానిసలు కామనీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ మేరకు సీపీఎ్‌సను రద్దు చేయాలనీ, లేకుంటే మరో స్వాతంత్య్ర పోరాటంలా ఉద్యమం ఉధృతం చేసి, సాధించుకుంటామని గర్జించారు. బుధవారం పెన్షన్‌ విద్రోహదినాన్ని పురస్కరించుకుని ఉద్యోగులు, ఉపాధ్యాయులు నగరంలో రెండు వేర్వేరు చోట్ల ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించారు. ఏపీసీపీఎ్‌సఈఏ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద భారీ సభ ఏర్పాటు చేశారు. ఫ్యాప్టో, ఏపీసీపీఎ్‌సయూఎస్‌, ఏపీఎన్జీఓ ఇతర సంఘాల ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ చేపట్టి, పాత ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్‌ వద్ద జరిగిన సభలో ఉద్యోగులనుద్దేశించి ఏపీసీపీఎ్‌సఈఏ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ... ఏడేళ్ల కిందట ఇదే అనంతపురంలో ఏపీసీపీఎ్‌సఈఏ ఆవిర్భవించిందన్నారు. సీపీఎస్‌ రద్దు కోసం ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో సీపీఎస్‌ రద్దుపై 119 సార్లు హామీ ఇచ్చారన్నారు. కమిటీలు, కాలయాపన లేకుండా రద్దు చేస్తామని ఉద్ఘాటించారు. దీంతో ఆయనను విశ్వసించి, పట్టం కూడా కట్టామన్నారు. ఆయన నిత్యం బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతగా చెబుతున్న మేనిఫెస్టోలో సీపీఎస్‌ రద్దు అంశం పెట్టినా... నేటికీ అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే రద్దు చేస్తామని చెప్పి.. రెండున్నరేళ్ల్లలో తొలి అడుగు కూడా వేయలేదన్నారు. ఐఏఎ్‌సలు, మంత్రుల సబ్‌ కమిటీలు వేసి ఏడాదిన్నర గడచినా... ఫలితం లేకుండా పోయిందన్నారు. సీఎంను ఉద్యోగుల పక్షాన 4 సార్లు కలిశామన్నారు. దానిపై కసరత్తు జరుగుతోందంటూ సీఎం చెబుతూనే ఉన్నారన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల చిన్నచూపు చూడడం తగదన్నారు. సీఎం ఇచ్చిన హమీని తక్షణం నెరవేర్చాలనీ, లేకుంటే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సభకు ఫోర్టో, ఏపీవైఎ్‌సఆర్‌టీఎఫ్‌, పీఆర్టీయూ, ఏపీఎస్టీయూఎస్‌, ఏపీఎస్సీ సంక్షేమ సంఘం, ఇతర సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కర్ణాటక ఉద్యోగుల సంఘం నాయకులు రంగనాథ్‌, ఫోర్టో చైర్మన్‌ హరికృష్ణ, వైఎ్‌సఆర్‌టీఎఫ్‌ రాష్ట్ర నాయకులు అశోక్‌, పీఆర్టీయూ శ్రీధర్‌, ఏపీసీపీఎ్‌సఈఏ జిల్లా అధ్యక్షుడు గోపాలప్ప, నాయకులు రాంప్రసాద్‌, శర్మాస్‌ సాహెబ్‌,  హరి, సహదేవరెడ్డి, రామన్న, మంజునాథ్‌, హంపయ్య, యుగంధర్‌, ఇతర సంఘాల నేతలు రవీంద్ర, జయరాం, సీపీఎస్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఉద్యమాన్ని నీరుగార్చే యత్నం

ప్రభుత్వ వైఖరిపై సీపీఎస్‌ ఉద్యోగులు తీవ్ర అసనహం, అసంతృప్తితో ఉన్నారు. భారీ ఆందోళనకు దిగడంతో ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు జరిగాయన్న వాదనలు ఆ వర్గాల నుంచే వినిపించాయి. ఒకేరోజు ఒకే అంశంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు రెండు వర్గాలుగా ర్యాలీ, బహిరంగ సభలు నిర్వహించాయి. జిల్లాలో పోలీసులు ఏపీసీపీఎ్‌సఈఏ చేయాల్సిన ర్యాలీకి అనుమతి నిరాకరించారు. దీంతో వారు ర్యాలీ లేకుండా బహిరంగ సభ మాత్రమే నిర్వహించాల్సి వచ్చింది. ఫ్యాప్టో, ఏపీసీపీఎ్‌సయూఎస్‌ ఇతర సంఘాల ర్యాలీకి అనుమతి లేకపోయినా.. వారు చేపట్టారు. అనుమతి లేకపోయినా..వారు ర్యాలీ చేసేలా మద్దతు ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకేరోజు యూనియన్లు రెండు వేర్వేరు చోట్ల నిరసనలు తెలుపుతుంటే... ఒక సంఘం ర్యాలీకి మద్దతుగా నిలవడం, మరో సంఘం ర్యాలీకి అనుమతి నిరాకరించడం చూస్తుంటే.. ప్రభుత్వం సీపీఎస్‌ రద్దు ఉద్యమాన్ని నీరుగార్చే కుయుక్తులు పన్నుతోందన్న విమర్శలు సీపీఎస్‌ ఉద్యోగుల నుంచి, పలు సంఘాల నాయకుల నుంచి వినిపించాయి.నగరంలో భారీ ర్యాలీ

ఫ్యాప్టో, ఏపీసీపీఎ్‌సయూఎస్‌, ఇతర సంఘాల ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. క్లాక్‌టవర్‌ నుంచి సుభా్‌షరోడ్డు, సప్తగిరి సర్కిల్‌ మీదుగా తిరిగి క్లాక్‌టవర్‌ వరకూ ర్యాలీ చేశారు. సీపీఎస్‌ రద్దు చేయాలనీ, పెన్షన్‌ భిక్ష కాదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వెంటనే  సీపీఎస్‌ రద్దు చేయాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ధర్నాకు సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రం, పలు రాషా్ట్రలు సీపీఎస్‌ రద్దు చేయలేమని చెబుతున్నాయన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికీ పాత పెన్షన్‌అమలు చేస్తున్నారనీ, ఆ రాషా్ట్రన్ని సీఎం జగన్‌ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఇతర నాయకులు మాట్లాడుతూ... పాత పెన్షన్‌విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో చైర్మన్‌ జయచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి సూర్యుడు, కో-చైర్మన్లు హనుమప్ప, రవీంద్ర, ఏపీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు అతావుల్లా, మనోహర్‌, ఏపీటీఎఫ్‌ రఘురాం, కులశేఖర్‌రెడ్డి, ఇతర సంఘాల నాయకులు ముత్యాలప్ప, వెంకటరత్నం, లక్ష్మీనారాయణ, పెద్దన్న, పురుషోత్తం, ఓబులేసు, త్రిమూర్తి, విశ్వనాథ్‌, నాగేంద్ర, సుధాకర్‌, గోపాల్‌రెడ్డి, అక్కులప్ప పాల్గొన్నారు.

Updated Date - 2021-09-02T06:19:34+05:30 IST