కోటరీకే పెద్దపీట!

ABN , First Publish Date - 2021-07-12T06:27:42+05:30 IST

జిల్లా విద్యాశాఖలో ఒకే వర్గానిది ఆధిపత్యం నడుస్తోంది. ఆ కోటరీ చెప్పే వారికే కాసులు కురిసే సీట్లు దక్కుతాయి.

కోటరీకే పెద్దపీట!

కోటరీకే పెద్దపీట!

డీఈఓ ఆఫీసులోకాసులు కురిసే సీట్లన్నీ అయినోళ్లకే 

తీవ్ర అసంతృప్తిలో జూనియర్లు

అర్హులైనా కొత్త వారికి చోటు శూన్యం 

ఏళ్ల తరబడి పాతుకుపోయిన సీనియర్లు

ఒక ఏడీ, ఇతర సూపరింటెండెంట్లదే రాజ్యం

పైసలివ్వందే ఫైల్స్‌ కదల్చరు

పాలనను పట్టించుకోని ఉన్నతాధికారి


- జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అనేక మంది ఉన్నతాధికారుల వద్ద డ్రైవర్‌గా పనిచేసిన ఓ చిరుద్యోగి ఇటీవల రిటైర్‌ అయ్యాడు. ఆయనకు రావాల్సిన అరియర్స్‌ కోసం కార్యాలయ ఏడీ వద్దకు పలుమార్లు తిరిగాడు. మామూళ్లు ఇస్తే కానీ ఫైల్‌ ముట్టమంటూ ఓ ఏడీ తెగేసి చెప్పాడు. ఇన్నేళ్లు సేవ చేశానన్న కనికరమూ కూడా చూపటం లేదంటూ ఆ చిరుద్యోగి ఇటీవల ఇతరుల వద్ద వాపోయాడు. 

- సీసీ పోస్టులో టైపిస్టును నియమించాలన్నది నిబంధన. డీఈఓ ఆఫీ్‌సలోని ఓ టైపిస్టు గత మూడేళ్లుగా ఉన్నతాధికారులను, ఏడీలను కోరుతున్నాడు. అయినా నియమించలేదు. ఇటీవల ధర్మవరం డివిజన్‌లో సీసీ పోస్టులోకి ఓ జూనియర్‌ అసిస్టెంట్‌ను నియమించారు.

ఇలాంటి అక్రమాలు డీఈఓ ఆఫీ్‌సలో సాధారణమైపోయాయి.

 అనంతపురం విద్య, జూలై 11 : జిల్లా విద్యాశాఖలో ఒకే వర్గానిది ఆధిపత్యం నడుస్తోంది. ఆ కోటరీ చెప్పే వారికే కాసులు కురిసే సీట్లు దక్కుతాయి. ఆ కోటరీకి శా ఖలోని ఓ ఉన్నతాధికారి సైతం పట్టం కడతారన్న విమర్శలు బాహటంగా వినిపిస్తున్నాయి. సర్వీసు మ్యాటర్స్‌పై, ఇతర సబ్జెక్టులపై అనుభవం ఉన్నా తమ కోటరీ కాకుంటే మాత్రం బదిలీల్లో, పదోన్నతుల్లో డీఈఓ ఆఫీ్‌సలోకి అడుగు పెట్టనీయకుండా అక్కడే ఏళ్లుగా తిష్టవేసిన కోటరీ మోకాలడ్డుతోంది. ఎలాంటి సబ్జెక్టు, అనుభవం లేనివారిని, బేరాలు బాగా ఆడి జేబులు నింపేవారినే కా ర్యాలయంలోని  పలు కీలక సీట్లలో నియమించుకుంటారు. తమ ఆశీస్సులు లేని జూనియర్లను గత కొన్నేళ్లుగా కోటరీగా ఏర్పడి చక్రం తిప్పుతున్న  సీనియర్లు రానివ్వకుండా అడ్డుకుంటున్నా రు. అర్హులైన జూనియర్‌ అసిస్టెంటు, సీనియర్‌ అసిస్టెంట్లు, అటెండర్లను ఆఫీ్‌సకు కాకుండా దూర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, డైట్‌కు పంపేస్తారు. గత కొన్నేళ్లుగా ఇదేతంతు జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


ఎక్కడికెళ్లినా... తిరిగి అక్కడికే 

ఎక్కడికెళ్లినా తిరిగి అక్కడికే చేరాలన్నట్టు కొందరు జిల్లా విద్యాశాఖలోకి చేరుతా రు. ఉన్నతాధికారి, ఒక ఏడీ, కొందరు సూపరింటెండెంట్ల ఆశీస్సులు మెండు గా ఉన్న సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌  అసిస్టెంట్లు, ఇతర క్లరికల్‌ సిబ్బం ది డీఈఓ ఆఫీస్‌ నుంచి బదిలీపై వెళ్లినా, ఉద్యోగోన్నతిపై వెళ్లినా మళ్లీ మళ్లీ ఠంఛనుగా ఆఫీ్‌సకు వేసుకుంటారు. బీ- సెక్షన్‌లో సూపరింటెండెంట్‌గా ఉన్న ఉద్యోగికి గతంలో కడప ఆర్‌జేడీ ఇచ్చిన అసలు స్థానం డీఈఓ ఆఫీ్‌సలోని ఎండీఎం విభాగం. అయితే అక్కడ కొన్ని నెలలు గడిపి వెంటనే డీఈఓ ఆఫీ్‌సలో బీ సెక్షన్‌కు మారిపోయారు. ఈ మార్పు వెనుక ఆశాఖ బాస్‌ ఆశీస్సులు మెండు గా ఉన్నాయట! మూడేళ్ల కిందట డీఈఓ ఆఫీస్‌ నుంచి సమగ్రశిక్ష ప్రాజెక్టుకు ఫారిన్‌ సర్వీ్‌సపై వెళ్లిన సీనియర్‌ అసిస్టెంట్‌ ఇటీవల ఫారిన్‌ సర్వీసు ముగిసిన వెంటనే ఆగమేఘాల మీద డీఈఓ ఆఫీ్‌సలో  అడు గెట్టేశారు. ఆయన కార్యాలయంలో ఓ ఏడీ ఆశీస్సులు పు ష్కలంగా ఉన్నాయన్న విమర్శలు ఇతర ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి.  


గ్రూప్‌ రాజకీయాలు...

ఏపీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌ కింద జిల్లాలో వందలాది మంది ఉద్యోగులు ఉన్నారు. డీఈఓ ఆఫీస్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు, బుక్కపట్నంలోని డైట్‌ కాలేజ్‌ పరిధిలో అటెండర్లు, రికార్డు అసిస్టెంట్లు, టైపిస్టులు, జూనియర్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు ఇలా దాదాపు 250 నుంచి 300 మంది వరకూ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా డీఈఓ ఆఫీ్‌సలో పనిచేయాలన్నది చాలా మందికి కలగా ఉంది. జి ల్లా కేంద్రంలో ఉండటం, ప్రధాన కార్యాలయం కావడంతో ఎక్కువ మంది ఇక్కడ పనిచేయడానికి ఆసక్తి చూపుతారు. దీంతో ఇక్కడి సీట్లకు డిమాండ్‌ ఎక్కువ. అయితే సీనియర్ల కోటరీ... జూనియర్లను ఏమాత్రం డీఈఓ ఆఫీ్‌సలోకి కానీ, సమగ్రశిక్షలోని సీట్లకు కానీ రానివ్వడం లేదన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా డీఈఓ ఆఫీ్‌సలోకి అడుగు పెట్టాలంటే మాత్రం ఈ కోటరీని ప్రసన్నం చేసుకోవాల్సిందే. బదిలీపైన కానీ, ఉద్యోగోన్నతిపైన కానీ అక్కడికి రావాలంటే కోటరీకి కప్పం కట్టాల్సిందే. ఎంత లేద న్నా రూ.50 వేలు ముడుపులు చెల్లించుకోవాల్సిందే. కప్పం చెల్లించలేనివారు, కోటరీ ఆశీస్సులు లేనివారు సుదూర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, బుక్కపట్నంలోని డైట్‌ కళాశాల సీట్లతో సర్దుకుపోవాల్సిందే. అందువల్లే జిల్లాలోని ఏపీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ (ఏపీఎ స్‌ఈఎ్‌సఏ)లో ముసలం పుట్టిందన్న విమర్శలు వినిపిస్తు న్నాయి. యూనియన్‌లోని పెద్ద నాయకులు పెదవి విప్పక పోవడం వల్లే తమకు అన్యాయం జరుగుతోందని, బాధితుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయం టూ ఇటీవల జూనియర్లు కొత్త కార్యవర్గం ఎంపిక చేయడానికి నిరసన గళం విప్పారన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.  ఉన్నతా ధికారి వద్ద తమ సమస్యలు చెప్పేందుకు సీనియర్ల కోటరీ అవకాశం లేకుండా చేస్తోందని జూనియర్లు వాపోతున్నా రు. దీనికితోడు శాఖ బాస్‌ కనీసం ఫోన్లు కూడా ఎత్తకపో వడంతో తాము మరింత ఇ బ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఉన్నతాధికారి జిల్లా విద్యాశాఖ పాలనపై దృష్టి సారించకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారిం దన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.   

Updated Date - 2021-07-12T06:27:42+05:30 IST