మోదీ, జగనకు తగ్గుతున్న ప్రజాదరణ

ABN , First Publish Date - 2021-09-03T06:30:26+05:30 IST

ప్రజావ్యతిరేక విధానాలతో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగనకు ప్రజాదరణ తగ్గుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు.

మోదీ, జగనకు తగ్గుతున్న ప్రజాదరణ
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

పేదలు, కార్మికులు, కర్షకులను గాలికొదిలేసిన ప్రధాని

వైసీపీ పాలనలో దిగజారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ 

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 2:  ప్రజావ్యతిరేక విధానాలతో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగనకు ప్రజాదరణ తగ్గుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. గురువారం స్థానిక హెచ్చెల్సీ కాలనీ లోని వీకే మెమోరియల్‌ హాల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ అధ్యక్షతన  నిర్వహించిన సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెడుతున్నారని, కరోనా సమయంలో దేశవ్యాప్తంగా అన్ని రంగా లు ఆర్థిక ఇబ్బందులతో కూరుకుపోయినా, అదానీ, అం బానీల ఆస్తులు మాత్రం అత్యధికంగా పెరిగాయన్నా రు.  పేదలు,   కార్మికులు, కర్షకుల సమస్యలను గాలికొదిలేసి పెద్దోళ్లలను మరింత ధనవంతులు చేసే పనిలో మోదీ ఉన్నారని ఎద్దేవా చేశారు.  సీఎం జగన పాలన లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారి పోయిందని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందన్నారు. అప్పుల కోసం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. అప్పులు పుట్టకపోవడంతో స్టేట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన ఏర్పా టు చేసి అప్పుల కోసం తిరుగుతూ అప్పుల మంత్రిగా బుగ్గన మారారన్నారు. ఒకటో తేదీ పెన్షన తీసుకోకపోతే లబ్ధిదారుల పేర్లను తొలగిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు ప్రభుత్వ వేధింపులు, కక్షసాధింపులు భరించలేక ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నా, మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. వలంటీర్లతో నేరుగా సంబంధాలు కల్పించుకుని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులను డమ్మీలుగా చేసి అంతాతానై సీఎం జగన పాలిస్తున్నారన్నారు. సమస్యల పరిష్కారం, సీపీఎస్‌ రద్దు  కోసం ప్రభుత్వ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి తిరగబడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈనెల 25న చేపట్టే భారతబంద్‌లో సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు అధికసంఖ్యలో పా ల్గొని జయప్రదం చేయాలని కోరారు. గ్రామ, మండల, పట్ణణ, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర మహాసభలు జరిపి జాతీయ మహాసభలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో సమస్యల పరిష్కారానికి చేసే పోరాటాలతోనే గుర్తింపు సాధ్యమన్నారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్‌ నాయకులు ఎంవీ రమణ, సూర్యనారాయణరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు జాఫర్‌, పి నారాయణస్వామి, కార్యవర్గ సభ్యులు శ్రీరాములు, సంజీవప్ప, రాజారెడ్డి, మల్లికార్జున, వేమయ్యయాదవ్‌, లెనిన, కాటమయ్య, కేశవరెడ్డి, గో విందు, రమేష్‌, శంకుంతలమ్మ, అమీనమ్మ, పద్మావతి, చలపతి, టి నారాయణస్వామి, లింగమయ్య, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-03T06:30:26+05:30 IST