రెండో విడత పారిశ్రామిక రాయితీ విడుదల
ABN , First Publish Date - 2021-09-04T06:34:23+05:30 IST
: జిల్లాలో ఎంఎ్‌సఎంఈలు, టెక్స్‌టైల్స్, స్పిన్నింగ్ మిల్లులకు ఊతమిస్తూ... రెండో విడత పారిశ్రామిక రాయితీని ప్రభుత్వం విడుదల చేసిందని కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన పేర్కొన్నారు.
జిల్లాలో 1258 ఎంఎ్‌సఎంఈలకు రూ.55.98 కోట్లు లబ్ధి
జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన
అనంతపురం, సెప్టెంబరు3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎంఎ్‌సఎంఈలు, టెక్స్‌టైల్స్, స్పిన్నింగ్ మిల్లులకు ఊతమిస్తూ... రెండో విడత పారిశ్రామిక రాయితీని ప్రభుత్వం విడుదల చేసిందని కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన పేర్కొన్నారు. ఆ మేరకు జిల్లాలో ఇన్సెంటివ్ కింద 371 ఎంఎ్‌సఎంఈలు, రీస్టార్ట్ ప్యాకేజీ కింద 887 ఎంఎ్‌సఎంఈలకు మొత్తంగా 1258 ఎంఎ్‌సఎంఈలకు రూ.55.98 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి.. ఎంఎ్‌సఎంఈలకు రెండో విడత పారిశ్రామిక రాయితీలను విడుదల చేయడంతోపాటు ఆ పరిశ్రమదారుల బ్యాంకు అకౌంట్‌కు నేరుగా ప్రోత్సాహకాలను జమ చేశారు. కలెక్టరేట్ నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్సకు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, శాసనమండలి విప్ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి, ఉషశ్రీచరణ్, తిప్పేస్వామి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన నదీం అహ్మద్, వక్కలిగ కార్పొరేషన చైర్‌పర్సన నళిని, మేయర్ వశీం, నాటక అకాడమీ చైర్‌పర్సన హరితారాజగోపాల్, ఆర్టీసీ రీజినల్ చైర్‌పర్సన మంజుల హాజరయ్యారు. సీఎం వీడియో కాన్ఫరెన్స అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలోని 371 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా యూనిట్లకు సంబంధించి 731 క్లెయిమ్‌లకు రూ.43.38 కోట్లు ప్రోత్సాహకాలు, కొవిడ్ కారణంగా నష్టపోయిన 887 ఎంఎ్‌సఎంఈలకు రీస్టార్ట్ పాలసీ కింద రూ.12.59 కోట్లను ముఖ్యమంత్రి విడుదల చేశారన్నారు. జిల్లాలో గతేడాది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.90.15 కోట్లు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించిందన్నారు. జిల్లాలో రూ.1758.67 కోట్ల పెట్టుబడితో 56,630 మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎ్‌సఎంఈలకు ఊతమిచ్చే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇచ్చిందన్నారు. జిల్లాలో 14 ఎంఎ్‌సఎంఈ పార్కులకు ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. ఇప్పటికే 12 ఎంఎ్‌సఎంఈ పార్కులకు 879.72 ఎకరాలు కేటాయించామన్నారు. అనంతరం ప్రభుత్వ విప్‌లు, కలెక్టర్, ప్రజాప్రతినిధులు పారిశ్రామికవేత్తలకు రూ. 55.98 కోట్ల మెగా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన లిఖిత, జేసీ గంగాధర్ గౌడ్, పరిశ్రమల శాఖ జీఎం అజయ్‌కుమార్, ఏడీసీసీ బ్యాంకు మాజీ అధ్యక్షుడు పామిడి వీరాంజనేయులు, పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల శాఖాధికారులు పాల్గొన్నారు.