సచివాలయాలను తనిఖీ చేయాలి

ABN , First Publish Date - 2021-08-27T06:39:10+05:30 IST

: వారం లో నాలుగు సచివాలయాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ సంబంధిత అదికారులను ఆదేశించారు

సచివాలయాలను తనిఖీ చేయాలి
వీసీలో మాట్లాడుతున్న కలెక్టర్‌

జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌

అనంతపురం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): వారం లో నాలుగు సచివాలయాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ సంబంధిత అదికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం విజయవాడ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌, ప్లానింగ్‌ స్పెషల్‌ సీఎస్‌  గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీసీకి కలెక్టరేట్‌ నుంచి జిల్లా క లెక్టర్‌తో పాటు జెడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి, డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డిలు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా క లెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ మాట్లాడుతూ... సచివాలయాల తనిఖీకి అధికారులు అధిక ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించా రు. వారానికి నాలుగు సచివాలయాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని, మండల స్థాయిలో ఎంపీడీఓ, తహసీల్దార్‌లు, మున్సిపాల్టీల్లో మున్సిపల్‌ కమిషనర్లు, డివిజన్‌స్థాయిలో ఆర్డీఓలు, డీఎల్‌డీఓలు, జిల్లా స్థాయిలో జెడ్పీ సీఈఓ, డీపీఓలు, జా యింట్‌ కలెక్టర్లు తనిఖీ చేయాలన్నారు. సచివాలయాల్లో అన్ని ప్రభుత్వ పథకాలకు సం బంధించిన పోస్టర్లు, లబ్ధిదారుల జాబితా, ఫో న్‌ నెంబర్లు ఉన్నయా..? లేదా అన్నది పరిశీలించాలన్నారు. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు ప్రభుత్వ పథకాల గురించి అవగాహాన ఉందా...? లేదా అ న్న ది చూడాలన్నారు. పింఛన్‌లు, రైస్‌ కార్డులు మూడు నెలల్లో మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మత్స్యకార భరోసా, వైఎ్‌సఆర్‌ చేయూత. కాపు నేస్తం, నేతన్న నేస్తం, వాహనమిత్ర తదితర పథకాలకు సంబంధించి నిర్దేశించిన సమయంలోగా అర్హులైన లబ్ధిదారులను పరిశీలన చేసి లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వి విధ శాఖల అదికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-27T06:39:10+05:30 IST