రేపు నన్ను కలిసేందుకు అవకాశం
ABN , First Publish Date - 2021-06-09T06:52:40+05:30 IST
గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్‌గా బదిలీపై వెళ్తున్న నేపథ్యంలో ఈనెల 10వ తేదీన తనను వ్యక్తిగతంగా కలవాలనుకునే వారికి అవకాశం కల్పిస్తున్నట్లు బదిలీ అయిన కలెక్టర్ గం ధం చంద్రుడు మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు.
బదిలీ అయిన కలెక్టర్ గంధం చంద్రుడు
అనంతపురం వ్యవసాయం, జూన్ 8: గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్‌గా బదిలీపై వెళ్తున్న నేపథ్యంలో ఈనెల 10వ తేదీన తనను వ్యక్తిగతంగా కలవాలనుకునే వారికి అవకాశం కల్పిస్తున్నట్లు బదిలీ అయిన కలెక్టర్ గం ధం చంద్రుడు మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం మధ్యా హ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అందుబాటులో ఉంటానన్నారు.