దాతల సహకారం మరువలేనిది

ABN , First Publish Date - 2021-05-30T05:48:25+05:30 IST

పట్టణంలో దాతల సహకారం మరువలేనిదని కలెక్టర్‌ గంధం చంద్రు డు పేర్కొన్నారు.

దాతల సహకారం మరువలేనిది
ఆస్పత్రిలో సౌకర్యాలను తెలుసుకుంటున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

కలెక్టర్‌ గంధం చంద్రుడు

క్రౌడ్‌ ఫండెండ్‌ కొవిడ్‌ ఆస్పత్రి ప్రారంభం

ధర్మవరంఅర్బన్‌, మే 29: పట్టణంలో దాతల సహకారం మరువలేనిదని కలెక్టర్‌ గంధం చంద్రు డు పేర్కొన్నారు. కరోనా ఉధృతి కొనసాగుతున్న తరుణంలో దాతల సహాయంతో ఆర్డీఓ మఽధుసూదన్‌ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో రూ.20.50 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటుచేసిన క్రౌడ్‌ ఫండెండ్‌ కొవిడ్‌ ఆస్పత్రిని కలెక్టర్‌, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రిలోని గదులు, ఆక్సిజన్‌ ప్లాంట్‌ను పరిశీలించారు. ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అవసరమున్న రోగులందరికీ సేవలందించేలా ఏర్పాటు చేశామనీ, 30 పడకలు ఆపై 50 వరకు పెంచేలా ఏర్పాట్లు చేసినట్లు ఆర్డీఓ మధుసూదన్‌.. కలెక్టర్‌కు వివరించారు. ధర్మవరంలాంటి జనాభా ఎక్కువ ఉ న్న ప్రాంతాల్లో కొవిడ్‌ బాధితులకు బెడ్ల కొరత లేకుండా నూతనంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రి ఎం తో ఉపయోగకరమని కలెక్టర్‌ పేర్కొన్నారు. జిల్లాలో కొవిడ్‌ నిర్మూలనకు పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ బాధితుల నుం చి అధికంగా డబ్బు వసూలు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్‌, డీహెచ్‌ఎ్‌స రమేశ్‌ నాథ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లింగం నిర్మల, వైస్‌చైర్మన్‌ చందమూరి నారాయణరెడ్డి, తహసీల్దార్‌ నీలకంఠారెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పద్మలత, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ అనురాధ, డాక్టర్‌ బషీర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-30T05:48:25+05:30 IST