కొవిడ్ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-03-24T06:37:35+05:30 IST
జిల్లాలో చేపట్టిన కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ గంధం చంద్రుడు.. సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతపురం, మార్చి23(ఆంధ్రజ్యో తి): జిల్లాలో చేపట్టిన కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ గంధం చంద్రుడు.. సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ నుంచి సం బంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ వ్యాక్సినేషన్, కొవిడ్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై కొవిడ్ నోడల్ అధికారులు, కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, వైద్యాధికారులు, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు తదితరులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో జనవరి 16న హెల్త్‌కేర్ వర్కర్లు, రెండో విడతలో జనవరి 25 నుంచి ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా వేయటం ప్రారంభించామన్నారు. వీరికి వ్యాక్సినేషన్ వందశా తం పూర్తి చేయాలన్నారు.
ఉపాధి పనులపై..
ఉపాధిహామీ పథకంపైనా కలెక్టర్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ కొత్తగా దరఖాస్తు చేసుకున్న 30 వేల జాబ్‌కార్డులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వా రందరికీ ఈనెల 25వ తేదీలోపు కొత్త జాబ్‌కార్డులు మంజూరు చేయాలని ఎం పీడీఓలను కలెక్టర్ ఆదేశించారు. వీడి యో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి, డీఎ్‌ఫఓ జగన్నాథ్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి కామేశ్వరప్రసాద్, డీసీహెచ్‌ఎ్‌స రమే్‌షనాథ్, జడ్పీ సీఈఓ శోభాస్వరూపారాణి, డీఎ్‌సఓ రఘురామిరెడ్డి, ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ నీరజ పాల్గొన్నారు.
ఉద్యోగులకు స్మార్ట్ హెల్త్‌కార్డులను పంపిణీ చేయాలి
ఉద్యోగులకు స్మార్ట్ హెల్త్ కార్డులను పం పిణీ చేయాలని కలెక్టర్ గంధం చం ద్రుడు.. సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన కలెక్టరేట్ నుంచి వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన ఎంప్లాయీస్ స్మార్ట్ హెల్త్‌కార్డులను ఆయన ఆవిష్కరించారు. బుధవారం నుంచి వాటిని సం బంధిత విభాగాధిపతులకు అందజేయాలని ఆదేశించారు.
వర్షపు నీటికి ఒడిసి పడదాం
అనంతపురం విద్య: వర్షపు నీటికి ఒడిసి పట్టేలా అన్ని ఆఫీసుల్లోనూ నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందని కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. జడ్పీలోని మీటింగ్ హాల్‌లో జల్ జీవన్ మిషన్‌పై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వర్షపు నీటిని పొదుపు చేయడం కోసం, వంద రోజుల జల్‌శక్తి అభియాన్ పేరుతో క్యాం పెయిన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖాధికారి జగన్నాథ్ సింగ్, జడ్పీ సీఈఓ శోభా స్వరూపరాణి, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు వేణుగోపాల్‌రెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు.