నిబంధనలకు లోబడే కౌంటింగ్‌

ABN , First Publish Date - 2021-03-14T06:03:59+05:30 IST

ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు లోబడే మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు.. సంబంధిత అధికారులను ఆదేశించారు.

నిబంధనలకు లోబడే కౌంటింగ్‌
అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాలలో కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ గంధం చంద్రుడు, జేసీ సిరి

కలెక్టర్‌ గంధం చంద్రుడు  

అనంతపురం, మార్చి13(ఆంధ్రజ్యోతి): ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు లోబడే మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు.. సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లపై టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముందుగా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాట్లపై ఆయా మున్సిపాలిటీల కమిషనర్లతో ఆరాతీశారు. కౌంటింగ్‌ సిబ్బందికి శిక్షణ, కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. మీడియా సెల్‌ ఏర్పాటు, ఎన్నికల ఏజెంట్లు, కౌం టింగ్‌ ఏజెంట్ల పాసుల పంపిణీ, డెమో కౌంటింగ్‌, కౌంటింగ్‌ ట్రేల ఏర్పాట్లపై ఆరా తీశారు. కౌంటింగ్‌ ప్రక్రియపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను సంబంధిత అధికారులకు వివరించారు. ఆర్వోలు నిబంధనల మేరకు నడుచుకోవాలన్నారు. ఆర్వోల అనుమతి లేకుండా పోలీసులు సహా ఎవరూ కౌంటింగ్‌ కేంద్రాల్లోకి ప్ర వేశించరాదన్నారు. ఆదివారం ఉదయం 7 గంటల్లోపు అందే బ్యాలెట్‌ ఓట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఆ తరువాత వచ్చే పోస్టల్‌ బ్యాలెట్ల ను తిరస్కరించాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తికాకుండా ఫలితాలను ప్రకటించొద్దన్నారు. చెల్లని ఓట్ల విషయంపై కూడా పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. ప్రతి కౌంటింగ్‌ కేంద్రం వద్ద మీడియా సెల్‌ను ఏర్పాటు చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి మీడియాకు అనుమతి లేనందున ఒక లైజన్‌ అధికారిని నియమించి, ఎప్పటికప్పుడు సమాచారం అం దించాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో విద్యుత్‌ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిబంధనల మేరకు కౌంటింగ్‌ హాల్‌లోకి అభ్యర్థులు, ఏజెంట్ల ను మాత్రమే అనుమతించాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ సిరి, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ నిశాంతి, ఆర్డీఓలు, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.


కౌంటింగ్‌ ఏర్పాట్ల పరిశీలన  

అనంతపురం కార్పొరేషన్‌: మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి నగరంలోని ఎస్‌ఎ్‌సబీఎన్‌ కళాశాలలో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్‌ గంధం చంద్రుడు పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయిం ట్‌ కలెక్టర్‌ సిరి, నగర కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి, అదనపు కమిషనర్‌ ప్ర మీల, ఆర్డీఓ గుణభూషణ్‌రెడ్డి, ఎన్నికల మాస్టర్‌ ట్రైనర్‌ గోవిందరాజులు, రిటర్నింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-14T06:03:59+05:30 IST