ప్రభుత్వం నిర్దేశించిన కొత్త ధరలే వసూలు చేయాలి

ABN , First Publish Date - 2021-05-02T06:32:42+05:30 IST

కరోనా నేపథ్యం లో ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్‌లు, ఆస్పత్రులు కొవిడ్‌-19 చికి త్స కోసం ప్రభుత్వం నిర్దేశించిన కొత్త ధరలనే వసూలు చేయాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశించారు.

ప్రభుత్వం నిర్దేశించిన కొత్త ధరలే వసూలు చేయాలి

అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తప్పవు..

ప్రైవేట్‌ ఆస్పత్రులకు కలెక్టర్‌  హెచ్చరిక

అనంతపురం,మే1(ఆంధ్రజ్యోతి) : కరోనా నేపథ్యం లో ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్‌లు, ఆస్పత్రులు కొవిడ్‌-19 చికి త్స కోసం ప్రభుత్వం నిర్దేశించిన కొత్త ధరలనే వసూలు చేయాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశించారు.   అధిక ధరలు వసూలు చేస్తే... చర్యలు తప్పవని  శనివారం ఓ ప్రత్యేక ప్రకటనలో హెచ్చరించారు. కొవిడ్‌-19 చికిత్సను అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా అందజేస్తారన్నారు. ఎక్కువ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్సకు అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్‌ నర్సింగ్‌హోమ్‌లు, ప్రైవే ట్‌ ఆస్పత్రులలో కొవిడ్‌ చికిత్సల కోసం ప్రభుత్వం గతంలో జారీచేసిన ఫీజులను సవరించి కొత్త ధరలను నిర్ణయిం చిందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల్లో కన్సల్టెన్సీ, నర్సింగ్‌ చార్జీలు, గది అద్దె, భోజనం, కొవిడ్‌ పరీక్షల రుసుము, పీపీఈ కిట్లు, మం దు లు ఉంటాయన్నారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన ధరల పట్టికను ఆయా ప్రైవేట్‌ ఆస్పత్రులు ప్రదర్శించాలన్నారు. చికిత్స ఆధారంగా నే ఫీజులు వసూలు చేయాలి తప్పా... ప్యాకేజీల రూపం లో వసూళ్లకు పాల్పడొద్దన్నారు. జిల్లాలో గుర్తించిన కొవిడ్‌ ఆస్పత్రుల్లో కరోనా బాధితులను తప్పనిసరిగా అడ్మిట్‌ చేసుకోవాలన్నారు. బాధితుల దగ్గర అడ్వాన్స్‌ వసూలు చేయరాదని కలెక్టర్‌ ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలను ఆదేశించారు.  


ప్రభుత్వం నిర్దేశించిన కొత్త ధరలివీ....

- నాన్‌ క్రిటికల్‌ చికిత్స కోసం ఎన్‌ఏబీహెచ్‌ ఆస్పత్రుల్లో ఒకరోజుకు రూ. 4 వేలు, నాన్‌ ఎన్‌ఏబీహెచ్‌ ఆస్పత్రుల్లో ఒకరోజుకు రూ. 3006లు వసూలు చేయాలి. 

- చికిత్స తో పాటు  ఎన్‌ఏబీహెచ్‌ ఆస్పత్రుల్లో ఒకరోజుకు రూ. 6500లు, నాన్‌ ఎన్‌ఏబీహెచ్‌ ఆస్పత్రుల్లో ఒకరోజుకు రూ. 5850లు వసూలు చేయాలి.

- ఐసీయూలో క్రిటికల్‌ కేర్‌ చికిత్సతో పాటు ఎన్‌ఐవీ కోసం ఎన్‌ఏబీహెచ్‌ ఆస్పత్రుల్లో ఒకరోజుకు రూ. 12 వేలు, నాన్‌ ఎన్‌ఏబీహెచ్‌ ఆస్పత్రుల్లో ఒకరోజుకు రూ. 10800లు వసూలు చేయాలి.

- క్రిటికల్‌ కేర్‌కు సంబంధించి ఐసీయూలో కరోనా చికిత్సతో పాటు వెంటిలేటర్‌ ఆధారంగా చికిత్స కోసం ఎన్‌ఏబీహెచ్‌ ఆస్పత్రుల్లో ఒకరోజుకు రూ. 16 వేలు, నాన్‌ ఎన్‌ఏబీహెచ్‌ ఆస్పత్రుల్లో ఒకరోజుకు రూ. 14400 వసూలు చేయాలి. 

- సిటీస్కాన్‌కు(ఫిల్మ్‌ రిపోర్టుతో కలిపి) రూ. 3 వేలు వసూలు చేయాలి. 

- రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ ఒకటి రూ. 2500, టోసీ లిజుమాబ్‌కు రూ. 30 వేలు వసూలు చేయాలి.

Updated Date - 2021-05-02T06:32:42+05:30 IST