తొలిరోజు 26 కేంద్రాల్లో పంపిణీ

ABN , First Publish Date - 2021-01-17T06:24:50+05:30 IST

జిల్లావ్యాప్తంగా కొవిడ్‌ టీకా వేసే కార్యక్రమం శనివారం కోలాహలంగా సాగింది. 26 కేంద్రాల్లో 2301 మందికి టీకా వేయాలని రిజిస్టర్‌ చేసి, మెసేజ్‌లు పంపించారు.

తొలిరోజు 26 కేంద్రాల్లో పంపిణీ
అనంత పురంలో మొదటి వ్యాక్సిన్‌ శ్రీవల్లికి వేస్తున్న వైద్య సిబ్బంది.. పరిశీలిస్తున్న ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ సిరి, ప్రజాప్రతినిధులు

కోలాహలంగాకొవిడ్‌ టీకా

2301 మందికి ఇవ్వాలని నిర్ణయం

1616 మందికి వ్యాక్సినేషన్‌.. 685 మంది దూరం..

అనంతపురం వైద్యం, జనవరి 16: జిల్లావ్యాప్తంగా కొవిడ్‌ టీకా వేసే కార్యక్రమం శనివారం కోలాహలంగా సాగింది. 26 కేంద్రాల్లో 2301 మందికి టీకా వేయాలని రిజిస్టర్‌ చేసి, మెసేజ్‌లు పంపించారు. 1616 మంది మాత్రమే కేంద్రాలకు వచ్చి కరోనా టీకా వేయించుకున్నారు. మిగతావారు టీకాకు దూరంగా ఉండిపోయారు. శనివారం జిల్లాలో 26 ఆస్పత్రుల్లో కరోనా టీకా పంపిణీ చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం వినేందుకు ప్రతి కేంద్రంలోనూ టీవీలు ఏర్పాటు చేశారు. ప్రసంగం అనంతరం జిల్లాలో టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నవీద్‌ అహ్మద్‌ చేతుల మీదుగా కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. తొలిగా డీఎంహెచ్‌ఓ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఫీల్డ్‌ వర్కర్‌ శ్రీవల్లికి కరోనా టీకా వేశారు. అనంతరం జిల్లావ్యాప్తంగా ఇతర కేంద్రాల్లో ప్రారంభించారు. టీకా పంపిణీ కార్యక్రమాల్లో అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ లు, అధికారులు పాల్గొన్నారు. ఒక్కో కేంద్రంలో 100 మం దికి టీకా వేయాల్సి ఉంది. రిజిస్టర్‌ చేయించుకున్నవారు పూర్తి స్థాయిలో హాజరు కాలేదు. దీంతో వచ్చిన వారికి మాత్రమే నిబంధనల ప్రకారం కరోనా వ్యాక్సిన్‌ వేశారు. కొన్ని కేంద్రాల్లో సరైన వసతులు కల్పించకపోవటంతో ఇబ్బందులు పడటం కనిపించింది. సర్వర్‌ సమస్యతో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కాక కొంత గందరగోళం కొనసాగింది. రిజిస్టర్‌ కోసం కొందరు వైద్యులు, సిబ్బంది కేంద్రాల వద్ద వేచి చూస్తు ఉండాల్సి వచ్చింది. చివరకు కొందరికి మాన్యువల్‌ రిజిస్టర్‌ చేసుకుని, కరోనా టీకా ఇచ్చారు.


అనంత ఆస్పత్రిలో అలజడి

జిల్లా సర్వజనాస్పత్రిలో కొవిడ్‌ టీకా కొంత ఆందోళనకు గురి చేసింది. అఖిల అనే హెల్త్‌ వర్కర్‌ టీకా వేయిం చుకున్న కొద్ది సేపటికి అస్వస్థతకు గురై, వాంతులు చేసు కుంది. దీంతో అధికారులు, వైద్యవర్గాలు ఆందోళన చెం దాయి. అక్కడే ఉన్న వైద్యులు ఆస్పత్రిలోని ఏఎంసీ విభా గానికి ఆమెను తరలించి, చికిత్సలు అందించారు. ఆమె ఆరోగ్యంగా ఉందనీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నవీద్‌ అహ్మద్‌ తెలిపారు.



వ్యాక్షినేషన్‌ వివరాలివీ..

జిల్లావ్యాప్తంగా 26 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ కార్యక్రమం చేపట్టారు. మొత్తం 2301 మందికి టీకా వేస్తామని మెసే జ్‌లు పంపించారు. 1616 మంది హాజరై, టీకా వేయించుకున్నారు. 685 మంది దూరంగా ఉండిపోయా రు. ఇందులో 529 మంది టీకాను నిరాకరించారు. మిగిలిన వారిలో 99 మంది గర్భిణులు, బాలింతలున్నారు. 57 మంది దీర్ఘకాలిక రోగాలున్నవారని డీఎంహెచ్‌ఓ అధికారికంగా వెల్లడించారు. అనంతపురంలోని ఇందిరానగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో 99 మందికి 73 మంది, ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో 100కి 41, కిమ్స్‌ సవీరాలో 100కి 71, గార్లదిన్నెలో 100కి 98, యాడికిలో 100కి 78, పెద్దవడుగూరులో 69కి 37, గుత్తిలో 98కి 30, ఎద్దులపల్లిలో 92కి 79, ఉరవకొండలో 100కి 30, వజ్రకరూరులో 72కి 55, మలకవేములలో 76కి 58, బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో 100కి 68, కురుగుంటలో 100కి 89 మంది, శెట్టూరులో 100కి 76, ముద్దినాయనపల్లి 100కి 88, ఎర్రగుంట్లలో 42కి 35, శాంతినగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో 100కి 63, పట్నంలో 68కి 60, పుట్టపర్తి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో 100కి 73, కొత్తచెరువులో 75కి 66, గుట్టూరులో 70కి 66, రొద్దం 92కి 76, హిందూపురం 100కి 46, లేపాక్షి 100కి 60, రొళ్ల 100కి 60, కళ్లుమర్రి 48కి 40 మంది టీకా వేయించుకున్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. టీకా వేయించుకోవడానికి వైద్యవర్గాలు దూరం కావటం చర్చకు దారితీస్తోంది. అధికారులు మా త్రం ప్రారంభోత్సవం ఆలస్యం కావడం, సర్వర్‌ సమస్యతో పూర్తిస్థాయిలో హాజరుకాలేకపోయారనీ, అందరికీ టీకా వేస్తామని చెబుతున్నారు.



వేర్వేరుగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రం 

ఒకే కేంద్రానికి రెండుసార్లు రిబ్బన్‌ కటింగ్‌

వేర్వేరుగా ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్సీ 

వైసీపీ శ్రేణుల్లో అయోమయం

హిందూపురం టౌన్‌, జనవరి 16: ఒకప్పుడు వారిద్దరు పోలీస్‌ అధికారులే. ఒకరు ఉన్నతాధికారులైతే మరొకరు సర్కిల్‌స్థాయి అధికారి. ప్రస్తుతం ఇద్దర ప్రజాప్రతినిధులయ్యారు. తొలి నుంచీ వారు దూరదూరంగానే ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. వారే ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌. శనివారం స్థానిక ప్రభుత్వాస్పత్రి ఆవరణలోని మాత, శిశుసంరక్షణ కేంద్రం లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ఉద యం 10 గంటలకే ఎమ్మెల్సీ ఇక్బాల్‌ హా జరై కొవిడ్‌ టీకా వేసే గదిని రిబ్బన్‌ కట్‌చేసి, పరిశీలించి లేపాక్షికి వెళ్లిపోయారు. మరికొంతసేపటికి ఎంపీ గోరంట్ల మాధ వ్‌ అక్కడికి చేరుకుని, మరోసారి రిబ్బన్‌ కట్‌చేశారు. టీకా వేసే కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్సీ ఇద్దరినీ వైద్యులు ఆహ్వానించారు. ఒకే సమయానికి ఇద్దరూ వ స్తారని భావించారు. వేర్వేరుగా రావటం తో వైద్యులతోపాటు అక్కడున్నవారు అ వాక్కయ్యారు. వైసీపీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. దీనిపై ఎమ్మెల్సీ ఇక్బాల్‌ను అడగ్గా.. లేపాక్షి కి 10.30 గంటలకు వస్తానని చెప్పాననీ, అందుకే అక్కడికి వెళ్లానన్నారు. ప్రధానమంత్రి ప్రసంగం పూర్తయిన తరువాత టీకా కార్యక్రమం ప్రారంభించాల్సి ఉండటంతో అక్కడికెళ్లానన్నారు. అంతేతప్పా.. ఎంపీ, తన మధ్య విబేధాలు లేవన్నారు.



Updated Date - 2021-01-17T06:24:50+05:30 IST