కొత్తగా 22 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-09-03T06:23:11+05:30 IST
జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 22 మంది కరోనా బారిన పడ్డారు. మరణాలు నమోదు కాలేదు.

అనంతపురం వైద్యం సెప్టెంబరు 2: జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 22 మంది కరోనా బారిన పడ్డారు. మరణాలు నమోదు కాలేదు. జిల్లాలో మొత్తం మీద 157188 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 155978 మంది కోలుకోగా.. 1091 మంది మరణించారు. ప్రస్తుతం 119 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు.