కరోనా కేసులు 2334

ABN , First Publish Date - 2021-05-20T06:39:10+05:30 IST

కరోనా కేసులు జిల్లాలో పైపైకి చేరుతున్నాయి. 1.20 లక్షలు దాటిపోయాయి. రోజురోజుకీ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతుండడం జిల్లాలో అలజడి రేపుతోంది.

కరోనా కేసులు 2334
మంచాలు లేక స్ట్రెచర్లపైనే బాధితుల ఎదురుచూపు

పాజిటివ్‌తో  8 మంది మృతి

జిల్లా కేంద్రానికి బాధితుల క్యూ

వసతులు, బెడ్లు లేక అవస్థలు

అనంతపురం వైద్యం, మే19: కరోనా కేసులు జిల్లాలో పైపైకి చేరుతున్నాయి. 1.20 లక్షలు దాటిపోయాయి. రోజురోజుకీ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతుండడం జిల్లాలో అలజడి రేపుతోంది. బుధవారం గడిచిన 24 గంటల్లో 2334 మంది కరోనా బారిన పడ్డారు. 8 మంది చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు జిల్లా లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 121449కి చేరింది. ఇందులో 105637 మం ది ఆరోగ్యంగా కోలుకున్నారు. 809 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 15003 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.


కరోనా బాధితులకు తప్పని కష్టాలు

కరోనా బాధితులు పెరిగిపోవడంతో చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రులకు పెద్దఎత్తున క్యూ కడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సమస్య వల్ల బాధితులను చేర్చుకోవడానికి భయపడుతున్నారు. మంగళవారం రాత్రి నుంచి బాధితులు ఆస్పత్రుల చు ట్టూ తిరుగుతున్నా ప్రైవేటు యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. దీంతో ప్రభుత్వ ఆస్పత్రే బాధితులకు దిక్కుగా మారింది. బుధవారం కొవిడ్‌ బాధితులతో జిల్లా ఆస్పత్రి కొవిడ్‌ ఓపీ కిటకిటలాడింది. అప్పటికే ఆస్పత్రిలో బెడ్లు మొత్తం బాధితులతో నిండిపోయాయి. వచ్చిన బాధితులు ఓపీ వద్దనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇక్కడ కూడా మంచాలు లేక గంటల తరబడి నేలపైనే ఉండాల్సి వచ్చింది. పలువురు వృద్ధులు, మహిళల బాధలు అందరినీ ఆవేదనకు లోనుచేశాయి. అయినా వైద్య సిబ్బంది నేలపైనే పడుకోబెట్టి చికిత్స అందిస్తూ కనిపించారు. మందుల కోసం జనం బారులు తీరారు. కొవిడ్‌ నిబంధనలు కొవిడ్‌ ఓపీ వద్దే కనిపించకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.


మండలాల వారీగా కొత్త కేసులు ఇలా..

జిల్లాలో గడిచిన 24 గంటల్లో 7277 శాంపిల్స్‌ పరీక్షించగా 2334 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఇందులో అనంతపురం 332, ధర్మవరం 188, కదిరి 99, బుక్కపట్నం 89, గుత్తి 80, అమరాపురం 71, హిందూపురం 70, కూడేరు 66, కళ్యాణదుర్గం 65, బ్రహ్మసముద్రం 62, కణేకల్లు 54, తాడిమర్రి 51, తాడిపత్రి 49, తనక ల్లు, గుంతకల్లు 44, నల్లమాడ 42, మడకశిర 41, పుట్టపర్తి 35, రాయదుర్గం 34, బెలుగుప్ప 32, బుక్కరాయదుర్గం, గార్లదిన్నె, గోరంట్ల 32, బత్తలపల్లి 31, గుడిబండ, రామగిరి 29, నార్పల, పెద్దపప్పూరు 28, బొమ్మనహాళ్‌, యల్లనూరు, పామిడి 26, అమడగూరు, యాడికి 25, ఓడీసీ 24, ఆత్మకూరు, చిలమత్తూరు, గాండ్లపెంట, కొత్తచెరువు, పెద్దవడుగూరు, పెనుకొండ 22, శెట్టూరు 19, కనగానపల్లి 17, రొళ్ల శింగనమల 15, సీకేపల్లి, కుందుర్పి 14, ముదిగుబ్బ, నల్లచెరువు, పరిగి, రొద్దం 12, పుట్లూరు, వజ్రకరూరు 10, డీ హీరేహాళ్‌, కంబదూరు, తలుపుల 8, ఎన్‌పికుంట, రాప్తాడు 7, గుమ్మఘట్ట, లేపాక్షి 5, మడకశిర 2 కేసుల చొప్పున నమోదయ్యాయి.


ఎమ్మెల్యే అనంతకు కరోనా పాజిటివ్‌

అనంతపురం కార్పొరేషన్‌, మే19: అనంతపురం ఎ మ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే బుధవారం కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. ప్రాథమికంగా పాజిటివ్‌గా తేలింది. త నతో కాంటాక్ట్‌ ఉన్న వారు కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.Updated Date - 2021-05-20T06:39:10+05:30 IST