మరో ముగ్గురికి కరోనా

ABN , First Publish Date - 2021-02-01T07:05:42+05:30 IST

జిల్లాలో మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 3339 నమూనాలు పరీక్షించగా ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

మరో ముగ్గురికి కరోనా

అనంతపురం వైద్యం, జనవరి 31: జిల్లాలో మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 3339 నమూనాలు పరీక్షించగా ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. పుట్టపర్తిలో 2, కదరిలో 1 కొత్త కేసు నమోదైంది. జిల్లాలో ఇప్పటి వరకు 67644 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 67005 మంది ఆరోగ్యంగా కోలుకు న్నారు. 599 మంది మరణించగా ప్రస్తుతం 40 మంది చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-02-01T07:05:42+05:30 IST