మరో ముగ్గురికి కరోనా

ABN , First Publish Date - 2021-02-08T06:15:36+05:30 IST

జిల్లాలో ఆదివారం ముగ్గురు కరోనా బారిన పడ్డారు. మొత్తం 4277 శాంపిళ్లను పరీక్షించగా.. అందులో ముగ్గురికి పాజిటివ్‌ అని తేలింది.

మరో ముగ్గురికి కరోనా

అనంతపురం వైద్యం, ఫిబ్రవరి7: జిల్లాలో ఆదివారం ముగ్గురు కరోనా బారిన పడ్డారు. మొత్తం 4277 శాంపిళ్లను పరీక్షించగా.. అందులో ముగ్గురికి పాజిటివ్‌ అని తేలింది. హిందూపురంలో ఇద్ద రు, పుట్టపర్తిలో ఒకరు వైరస్‌ బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 67676కు చేరింది. ఇందులో 67042 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 599 మంది మరణించారు. ప్రస్తుతం 35 మంది చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో వైర్‌సతో ఎవరూ మరణించలేదని అధికారులు వెల్లడించారు.

Updated Date - 2021-02-08T06:15:36+05:30 IST