కొత్తగా ఆరు కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-01-12T06:41:37+05:30 IST

జిల్లాలో సోమవారం కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి.

కొత్తగా ఆరు కరోనా కేసులు

అనంతపురం వైద్యం, జనవరి 11: జిల్లాలో సోమవారం కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. నాలుగు మండలాల్లో కొత్త కేసులు వచ్చాయి. అందులో పుట్టపర్తి, గోరంట్లలో 2 చొప్పున, అనంతపురం, బుక్కపట్నం మండలాల్లో ఒక్కో కేసు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో 67510 మం ది కరోనా బారిన పడ్డారు. ఇందులో 597 మంది మరణించారు. 66794 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. ప్రస్తుతం 119 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో కొవిడ్‌తో ఎవరూ మరణించలేదని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-01-12T06:41:37+05:30 IST