గుప్తనిధుల వేటగాళ్ల అరెస్టు
ABN , First Publish Date - 2021-02-01T06:35:02+05:30 IST
మండల పరిధిలోని టి.డి.పల్లి గ్రామ సమీపంలో ఉన్న పూలమల్లయ్య కొండలో రంగనాథస్వామి దేవాలయం వద్ద గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఏడుగురిని అరెస్టు చేసినట్లు సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్‌ఐ శేషగిరి తెలిపారు.

మడకశిరటౌన్, జనవరి 31: మండల పరిధిలోని టి.డి.పల్లి గ్రామ సమీపంలో ఉన్న పూలమల్లయ్య కొండలో రంగనాథస్వామి దేవాలయం వద్ద గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఏడుగురిని అరెస్టు చేసినట్లు సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్‌ఐ శేషగిరి తెలిపారు. ఆదివారం రాత్రి సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. వారు తెలిపిన మేరకు పూలమల్లయ్య కొండ వద్ద వెలిసిన రంగనాథస్వామి గుడి ముందు ఉన్న ధ్వజస్తంభం దగ్గరలో బంగారం, ఆభరణాలు, వజ్రాలు మొదలైన విలువైన వస్తువులు ఉన్నాయన్న ఉద్దేశంతో ఏడుగురు కలిసి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు వివరించారు. ఎస్‌ఐ సంఘటన స్థలాన్ని పరిశీలించి చాకచక్యంగా తవ్వకాలకు పాల్పడ్డవారిని పట్టుకున్నారు. వారి నుంచి పెద్ద గడ్డపార, రెండు గొడ్డెల్లు, రెండు పారలు, ఒక ప్లాస్టిక్ గోళం, ఏడు సెల్‌ఫోన్లు, గుప్తనిధులకు సంబంధించి వారు వేసుకున్న ప్లానింగ్ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులను పోలీసులు రిమాండ్‌కు పంపారు. జిల్లెడికుంట, చౌటిపల్లి, రొద్దం మండలం నార్‌నాగేపల్లి, ధర్మవరం, పెనుకొండ, కనగానపల్లికి చెందిన వారు మొత్తం ఏడుగురు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారని వివరించారు.