వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఏఓ

ABN , First Publish Date - 2021-08-27T05:58:46+05:30 IST

వర్షానికి దెబ్బతిన్న వరి, వేరుశనగ పంటలను గురువారం ఏఓ సుమతి పరిశీలించారు.

వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఏఓ

తలుపుల, ఆగస్టు 26: వర్షానికి దెబ్బతిన్న వరి, వేరుశనగ పంటలను గురువారం ఏఓ సుమతి పరిశీలించారు. మండలంలోని గుర్రంగుండ్లపల్లి, జ్యోతివాండ్లపల్లి, జ్యోతివాండ్లపల్లితండా, ఓబుళ రెడ్డిపల్లి, ఈదులకుంట్లపల్లి గ్రామాలలో బుధవారం కురిసిన వ ర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. రైతుల ఫిర్యాదు మేరకు ఏఓ పంట లను పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. అత్యధికంగా జ్యోతివాండ్లపల్లి, జ్యోతివాండ్లపల్లితండాల్లో వరిపంటలు నష్టం జరిగినట్లు ఏఓ తెలిపారు. 67 మంది రైతులకు చెందిన 86 ఎకరా ల్లో పంట నష్టం జరిగినట్లు నివేదికలు తయారు చేసి, ఉన్నతా ధికా రులకు పంపినట్లు ఆమె తెలిపారు. కాగా ఈదులకుంట్లపల్లి, పులి గుండ్లపల్లి పంచాయతీలలో కుంటలు, చెరువులు నిండాయి. పరి శీలించిన వారిలో  ఏఈఓ రహంతుల్లా, సిబ్బంది ఉన్నారు. 


Updated Date - 2021-08-27T05:58:46+05:30 IST