అన్నమేంది.. ఇంత లావుగా ఉంది..?

ABN , First Publish Date - 2021-12-30T05:56:10+05:30 IST

స్థానిక సబ్‌జైలులో ఉండే ఖైదీలకు ఇచ్చే అన్నం ఏమి ఇంత లావుగా ఉందని అంటూ సీని యర్‌ సివిల్‌ జడ్జి ఎం వెంకటేశ్వరరావు జైలు అధికారులను ప్రశ్నిం చారు.

అన్నమేంది.. ఇంత లావుగా ఉంది..?
భోజనాన్ని రుచిచూస్తున్న న్యాయమూర్తి వెంకటేశ్వరరావు

- సబ్‌జైలు విజిట్‌లో న్యాయమూర్తి

కదిరి లీగల్‌, డిసెంబరు 29: స్థానిక సబ్‌జైలులో ఉండే ఖైదీలకు ఇచ్చే అన్నం ఏమి ఇంత లావుగా ఉందని అంటూ సీని యర్‌ సివిల్‌ జడ్జి ఎం వెంకటేశ్వరరావు జైలు అధికారులను ప్రశ్నిం చారు. లావు బియ్యమా లేక వంట సరిగా వండలేదా అని ఆరా తీశారు. బుధవారం ఆయన  సబ్‌జైలును ఆకస్మికంగా విజిట్‌ చేశా రు. న్యాయమూర్తి వెంట లోక్‌ అదాలత్‌ సిబ్బంది ఎల్‌ఎన్‌ శారద, సబ్‌జైలు అధికారి వాసుదేవరెడ్డి ఉన్నారు. మొదట సబ్‌జైలులో ఉం టున్న ఖైదీలతో మాట్లాడారు. సబ్‌జైలుకు దినపత్రికలు వస్తున్నా యా, వాటిని మీకు అందజేస్తున్నారా లేదా అన్న విషయాలను కూ డా అడిగి తెలుసుకున్నారు. ఆ వెను వెంటనే న్యాయమూర్తి వంట శాల వైపు వెళ్ళారు. అక్కడ భోజనం తీసుకురావాలని సూచించారు. భోజనం పరిశీలించిన ఆయన సబ్‌జైలుకు సన్నబియ్యం సరఫరా చేయరా.. ప్రభుత్వం చెబుతోంది కదా అని సబ్‌జైలు అధికారులను ్త ప్రశ్నించారు. అలాంటివి ఏవీ లేవని రేషన్‌ బియ్యాన్నే సరఫరా చేస్తున్నారని వాటినే వండి పెడతామని  తెలిపారు. అయితే అన్నం మెత్తగా అయిపోయిందని న్యాయమూర్తి నొచ్చుకున్నారు. కూరలలో అధిక కారం వేశారని, మజ్జిగ కూడా పలుచగా ఉందన్నారు.  భోజ నం అనుకున్న స్థాయిలో లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే సబ్‌జైలులో ఉన్నంత కాలం సంక్షేమ సంరక్షణలు, ఆరోగ్య విషయా లు అందుకు తీసు కోవాల్సిన ఏర్పాట్లు అత్యంత ముఖ్యమని పేర్కొ న్నారు. నియమ నిబంధనల ప్రకారం, చట్టంప్రకారం నడుచుకో వా లని కూడా స్పష్టం చేశారు.

Updated Date - 2021-12-30T05:56:10+05:30 IST