తెలుగు తమ్ముళ్ల ఆధ్వర్యంలో అన్నదానం

ABN , First Publish Date - 2021-06-21T05:51:38+05:30 IST

కరోనా ఆంక్షల నేపథ్యంలో నిరా శ్రయులు, నిరుపేదలు, రోగులకు తెలుగుతమ్ముళ్ళు అన్నదానం నిర్వ హిస్తున్నారు.

తెలుగు తమ్ముళ్ల ఆధ్వర్యంలో అన్నదానం
టీఎనటీయూసీ చేపట్టిన అన్నదానంలో పాల్గొన్న తలారి ఆదినారాయణ

అనంతపురం వైద్యం, జూన20: కరోనా ఆంక్షల నేపథ్యంలో నిరా శ్రయులు, నిరుపేదలు, రోగులకు తెలుగుతమ్ముళ్ళు అన్నదానం నిర్వ హిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం టీడీపీ జిల్లా కార్యదర్శి సరిపూటిరమణ ఆధ్వర్యంలో  పేద నిరాశ్ర యులు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు అన్నం పంపిణీ చేశారు. టీడీపీ నేతలు నా రాయణస్వామియాదవ్‌, లింగారెడ్డి, దాసరి శ్రీధర్‌, కూచే హరి, కాకర్ల ఆదినారాయణ, టైలర్‌ శీనా, నరసింహులు, గౌసు, దాదాపీర్‌, సరిపూటి శ్రీకాంత, తాజుద్దిన, బెస్త అంజి, సరిపూటి యశశ్విని, సరిపూటి క్రాంతికుమార్‌, సరిపూటి కార్తిక్‌ తదితరులు పాల్గొన్నారు.

టీఎనటీయూసీ ఆధ్వర్యంలో... టీఎనటీయూసీ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఆదివారం 41వ రోజు నగరంలో నిరాశ్ర యులకు అన్నదానం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తలారి ఆదినా రాయణ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ సాగించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కరోనాతో చాలా మంది నిరాశ్రయులు అ న్నం దొరకక అవస్థలు పడుతున్నారని, అన్నా క్యాంటీన్లు మూసి వే యడంతో ఆకలితో అలమటిస్తున్నారన్నారు. ఈ పరిస్థితిని పాలకులు పట్టించుకోకపోయినా ప్రతిపక్ష టీడీపీ సోదరులు అన్నదానం చేస్తూ వారి ఆకలి తీర్చడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నా యకులు శ్రీధర్‌, గౌస్‌, రఫీ, వడ్డే సుంకన్న, వడ్డే మురళి, మున్వర్‌ బాషా, రవికుమార్‌గౌడ్‌, బండారు లక్ష్మణ్‌, తేజ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-21T05:51:38+05:30 IST