కరోనాతో అంగనవాడీ టీచర్‌ మృతి

ABN , First Publish Date - 2021-05-08T06:19:40+05:30 IST

పట్టణానికి చెందిన అంగనవాడీ టీచర్‌ అరుంధతి (54) కరోనాబారిన పడి శుక్రవారం మృతి చెందింది.

కరోనాతో అంగనవాడీ టీచర్‌ మృతి

రాయదుర్గం టౌన, మే 7 : పట్టణానికి చెందిన అంగనవాడీ టీచర్‌ అరుంధతి (54) కరోనాబారిన పడి శుక్రవారం మృతి చెందింది. ఈనెల ఒకటిన ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. అక్కడి నుం చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆరోగ్యపరిస్థితి విషమించి మృతి చెందింది. మృతురాలికి భర్త రామకృష్ణతో పాటు ఇద్దరు సంతానం. బాధిత కుటుంబానికి పలువురు అంగనవాడీ టీచర్లు, ఆయాలు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. 


బీజేపీ పట్టణ కార్యదర్శి...

గుంతకల్లు టౌన: కరోనా బారినపడి బీజేపీ పట్టణ కార్యదర్శి బూషప్పగారి సోమశేఖ ర్‌ (36) శుక్రవారం మృతి చెందారు. పదిరోజుల క్రితం పాజిటివ్‌ రావడంతో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గురువారం అ నంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. బీజేపీ నాయకులు మృతదేహం వద్ద ని వాళులర్పించి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. 


డాక్యుమెంట్‌ రైటర్‌...

కణేకల్లు : స్థానికంగా నివాసముంటున్న డాక్యుమెంట్‌ రైటర్‌ హనుమంతరావు (62) కరోనా బారినపడి శుక్రవారం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులు గా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన ఇంట్లోనే హోమ్‌ ఐసోలేషనలో వుంటూ చి కిత్స పొందారు. గురువారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అనంతపురం ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ రాత్రి మృతి చెందాడు.

Updated Date - 2021-05-08T06:19:40+05:30 IST