ముగిసిన అనంత డివిజన అంగనవాడీల ఇంటర్వ్యూలు

ABN , First Publish Date - 2021-12-31T05:28:48+05:30 IST

అనంతపురం డివిజన పరిధిలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల అంగనవాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు ముగిశాయి. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవనలో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించారు.

ముగిసిన అనంత డివిజన అంగనవాడీల ఇంటర్వ్యూలు

అనంతపురం వైద్యం, డిసెంబరు 30: అనంతపురం డివిజన పరిధిలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల అంగనవాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు ముగిశాయి. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ భవనలో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతపురం అర్బన, శింగనమల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, కూడేరు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలోని అభ్యర్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. జేసీ గంగాధర్‌గౌడ్‌, ఐసీడీఎస్‌ పీడీ సుజన, అనంతపురం ఆర్డీఓ మధుసూదన, డాక్టర్‌ సుజాత నేతృత్వంలో ఇంటర్వ్యూలు కొనసాగాయి. అంగనవాడీ ప్రధాన కార్యకర్త పోస్టులు 10, ఆయా 91 కలిపి 101 పోస్టులకు ఇంటర్వ్యూలు చేపట్టారు. 417 మంది పోటీ పడ్డారు. ప్రధాన కార్యకర్త పోస్టులకు 107 మందికిగాను 92 మంది హాజరుకాగా.. 15 మంది గైర్హాజరయ్యారు. ఆయా పోస్టులకు 310 మందికిగాను 274 మంది హాజరు కాగా.. 92 మంది గైర్హాజరయ్యారు. మొత్తం మీద 107 మంది గైర్హాజరైనట్లు పీడీ సుజన తెలిపారు. ఇంటర్వ్యూలకు ఆరు ప్రాజెక్టుల నుంచి అభ్యర్థులతోపాటు వారి కుటుంబ సభ్యులు తరలిరావడంతో అంబేడ్కర్‌ భవన కిటకిట లాడుతూ కనిపించింది. కొందరు అభ్యర్థులు తమ దరఖాస్తులు తిరష్కరించారని ఇంటర్వ్యూలు నిర్వహించే ప్రాంతానికి వచ్చి అధికారులకు ఫిర్యాదులు చేయగా.. వాటిపై స్పష్టత ఇవ్వడంతో సమస్య సద్దుమనిగింది.


Updated Date - 2021-12-31T05:28:48+05:30 IST