హిందూపురంలో ఘనంగా ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం

ABN , First Publish Date - 2021-11-02T05:54:03+05:30 IST

తెలుగు రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం ఎంతో గొప్పదని ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు.

హిందూపురంలో ఘనంగా ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం
పెనుకొండలో పొట్టి శ్రీరాములుకు నివాళులర్పిస్తున్న ఆర్యవైశ్యులు

హిందూపురం టౌన, నవంబరు 1: తెలుగు రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం ఎంతో గొప్పదని ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. సోమవారం ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకకుని చిన్నమార్కెట్‌లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం మేళాపురం సర్కిల్‌లోఉన్న తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష చేసి అమరుడయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన ఇంద్రజ, వైస్‌ చైర్మన బలరాంరెడ్డి, జబీవుల్లా, కౌన్సిలర్‌ మారుతిరెడ్డి, శివ, ఇందాద్‌, నాగభూషణరెడ్డి, గిరీష్‌, ఎల్‌ఐసి రవీంద్ర, నాగమణి, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మునిసిపల్‌ కార్యాలయంలో అమరజీవి చిత్రపటానికి కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈ మల్లికార్జున పాల్గొన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో అమరజీవిపొట్టి శ్రీరాములు విగ్రహానికి తహసీల్దార్‌ శ్రీనివాసులు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డీటీలు వెంకటేశ్వర్‌రావు, మహేష్‌, పవన, సిబ్బంది పాల్గొన్నారు. మహిళా డిగ్రీకళాశాలలో ప్రిన్సిపాల్‌ ప్రగతి నివాళులర్పించారు. 

పెనుకొండ: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఆర్యవైశ్య సంఘం జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు సుధాకర్‌గుప్త, యాడికి నాగరాజు, నామారాధస్వామి, నామరమణ, సూర్యనారాయణ, కంబాలపల్లి వెంకటేశ, ప్రవీణ్‌, జిల్లాసాధనకమిటీ నాయకులు రవూఫ్‌, కిరణ్‌, మూర్తి, దండోర రామాంజి, శంకర్‌రెడ్డి, నరహరి, రామలింగారెడ్డి, షేక్‌రియాజ్‌, పాలూరి కృష్ణమూర్తి, తదితరుల ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు చిత్రపటాన్ని ఊరువాకిలి ఆంజనేయస్వామి ఆలయం నుంచి తెలుగుతల్లి సర్కిల్‌ వరకు ఊరేగించారు. తెలుగుతల్లి విగ్రహానికి, అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. 
Updated Date - 2021-11-02T05:54:03+05:30 IST