అరాచక పాలనను అంతమొందించాలి

ABN , First Publish Date - 2021-10-20T06:34:02+05:30 IST

జగన అరాచక పరిపాలనతో ప్రజలు విసిగిపోయారని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు తప్పక బ్రహ్మరథం పడతారని మాజీ శాసనసభ్యుడు ఆర్‌ జితేంద్రగౌడు పేర్కొన్నారు.

అరాచక పాలనను అంతమొందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడు

గుంతకల్లు, అక్టోబరు 19: జగన అరాచక పరిపాలనతో ప్రజలు విసిగిపోయారని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు తప్పక బ్రహ్మరథం పడతారని మాజీ శాసనసభ్యుడు ఆర్‌ జితేంద్రగౌడు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆయన క్యాంపు కార్యాలయంలో టీడీపీ గుంతకల్లు ని యోజకవర్గ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈసంద ర్భంగా జితేంద్రగౌడు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఇంత ప్ర జా కంటకంగా పరిపాలన సాగించిన సీఎం మరొకరు లేరని, అధమ ప్రభుత్వాలన దగ్గ వాటిలో జగన ప్రభుత్వం ప్రథమ స్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు. రైతులు, వృద్ధులు, వికలాంగులు, రేషన వినియోగదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, వృ త్తిదారులు, ఇలా ప్రతి ఒక్కరినీ కష్టాలపాల్చేశాడన్నారు. ఐదే ళ్లూ చంద్రబాబు నాయుడు కరెంటు చార్జీలు పెంచలేదని, కానీ జగన గతంలోని బిల్లులకు రెండింతలు వసూలు చేస్తున్నాడన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేది తథ్యమన్నారు. రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్‌ మాట్లాడుతూ సంస్థాగత ఎన్నికల్లో పార్టీకి అవిశ్రాంతంగా పనిచేయదలచినవారే పదవులను తీసుకోవాల ని సూచించారు. చంద్రబాబు నా యుడును అధికారంలోకి తేవడాని కి ఇప్పటి నుంచి నిరంతరం పనిచేయాల్సి ఉంటుందన్నారు.


2019లో జగన చెప్పిన తప్పుడు మా టలు విని ప్రజలు మోసపోయారని, వచ్చే ఎన్నికల్లో మరోమా రు మోసపోవడానికి జనం సిద్ధంగా లేరన్నారు. జిల్లా మాజీ కా ర్యనిర్వాహక కార్యదర్శి కేసీ హరి మాట్లాడుతూ జగన దుర్మార్గపు పాలన అంతంకావాల్సిన అవసరముందన్నారు. సమన్వ య సదస్సుకు బత్తల వెంకటరాముడు పరిశీలకుడిగా వ్యవహరించారు. కార్యక్రమంలో పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి జీ వెంకటేశులు, పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్‌, మాజీ ఎంపీ పీ రాయల రామయ్య, కౌన్సిలరు ఆర్‌ పవన కుమార్‌గౌడు, సిం గిల్‌ విండో  సొసైటీ మాజీ అధ్యక్షుడు పాల మల్లికార్జున, నా యకులు హనుమంతు, తలారి మస్తానప్ప, బీసీ సెల్‌ రాష్ట్ర నా యకుడు గాలి మల్లికార్జున, టీ శివశంకర్‌, గుత్తి టౌన బ్యాంకు అధ్యక్షుడు జిలాన బాషా, గుత్తి నాయకులు వీరేశ, బద్రి వలి, శ్రీనివాస యాదవ్‌, సుధాకర్‌ నాయుడు, దిల్కా శీన, గోవర్ధన గౌడు, బీ పురుషోత్తం, శ్రీకాంత చౌదరి, పామిడి నాయకులు గౌ స్‌ పీరా, ప్రభాకర చౌదరి, సుంకిరెడ్డి, రాజు, ముసలిరెడ్డి, సంజీవయ్య, లక్ష్మినారాయణ రెడ్డి, ఆనంద్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T06:34:02+05:30 IST