అనంతపురం జిల్లాలో వింత జబ్బు ..

ABN , First Publish Date - 2021-08-27T20:37:58+05:30 IST

పరిగి మండలం, వనంపల్లిలో చిన్నారులకు వింతజబ్బు రావడం కలకలం రేపుతోంది.

అనంతపురం జిల్లాలో వింత జబ్బు ..

అనంతపురం జిల్లా: పరిగి మండలం, వనంపల్లిలో చిన్నారులకు వింతజబ్బు రావడం కలకలం రేపుతోంది. ఐదు నుంచి పదేళ్లలోపు చిన్నారులకు పాదాల కింది భాగంలో రక్తం గూడుకట్టినట్లు ఎర్రగా మచ్చలు ఏర్పడుతున్నాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వనంపల్లి ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులకు సయితం మచ్చలు రావడంతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. కాగా డాక్టర్లు మాత్రం ఈ వ్యాధి ప్రమాదకరం కాదని చెబుతున్నారు. వర్షాకాలంలో నల్లులులాంటి వాటిని తొక్కడంతో పిల్లల పాదాలు మచ్చలుగా కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు. 

Updated Date - 2021-08-27T20:37:58+05:30 IST