అనంతపురం: కళ్యాణదుర్గంలో సీపీఐ వినూత్న నిరసన
ABN , First Publish Date - 2021-10-29T21:02:50+05:30 IST
పెట్రోల్, నిత్యవసర ధరల పెరుగుదలను నిరసిస్తూ సీపీఐ నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

అనంతపురం జిల్లా: కళ్యాణదుర్గంలో పెట్రోల్, నిత్యవసర ధరల పెరుగుదలను నిరసిస్తూ సీపీఐ నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తాళ్లతో ఆటోను లాగి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓవైపు కరోనా, మరోవైపు నిత్యవసరధరల పెరుగుదలతో సామాన్యలు విలవిల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్నీ వర్గాలు ఇబ్బందులుపడుతున్నాయన్నారు.